అన్వేషించండి

ABP Desam Health Conclave 2025: పెరుగుతున్నఫెర్టిలిటీ సమస్యలకు జీవనశైలే కారణం - మరి ఎలా అధిగమించాలి?

ABP Desam Health Conclave 2025: యువతలో పెరుగుతున్న ఫెర్టిలిటీ సమస్యల పరిష్కారంపై ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్‌లో చర్చ జరిగింది. యశోద హాస్పిటల్స్ వైద్యులు సురేష్ కుమార్ , శారదా ఎన్నో విషయాలు వివరిచారు.

ABP Desam Health Conclave 2025:  ప్రస్తుత తరంలో ఓ వైపు ప్రపంచం అంతా జనాభా తగ్గిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం యువత ఆసక్తి చూపకపోవడం ఒకటి అయితే..  పిల్లలను కనాలనుకున్న వారికి ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు రావడం మరో కారణం. దంపతుల్లో పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య పెరిగిపోతోంది. దీనికి కారణాలేమిటి.. పరిష్కారాలేమిటి అన్న అంశంపై .. ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్‌లో విజ్ఞానదాయక చర్చ జరిగింది. యశోద హాస్పిటల్స్ నుండి పిడియాట్రిక్స్ స్పెషలిస్ట్ సురేష్ కుమార్ పానుగంటి , గైనకాలజిస్ట్ లాపరోస్కోపిక్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ శారదా  ఈ సమస్యలను విశ్లేషించారు.   

భారత్‌లో వేగంగా తగ్గిపోతున్న ఫెర్టిలిటీ రేటు          

2025లో భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) స్త్రీకి 1.9 పిల్లలకు తగ్గింది.  గతంలో 2.1 ఉండేది. 15-20 శాతం యువ జంటలు గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆలస్య వివాహాలు, కెరీర్ ప్రాధాన్యతలు, పట్టణీకరణ,  జీవనశైలి మార్పులు ఈ సమస్యకు కారణాలని డాక్టర్ శారద విశ్లేషించారు.  35 ఏళ్లలోపు మహిళల్లో ఇన్‌ఫెర్టిలిటీ పెరగడం ఆందోళనకరమని.. ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం  ఒత్తిడి  దీనికి కారణం అవుతోందన్నారు.         

జీవన శైలిసమస్యల వల్ల ఎక్కువగా ఇన్ ఫెర్టిలిటీ సమస్య    

బాల్యం నుండే పోషకాహార లోపం, ఊబకాయం,  టైప్-1 డయాబెటిస్ వంటి సమస్యలు యువతలో పెరుగుతున్నాయని పిడియాట్రిక్స్ స్పెషలిస్ట్ సురేష్ కుమార్ తెలిపారు.  11 నెలల పిల్లలలో కూడా డయాబెటిస్ నిర్ధారణ అవుతోంది, ఇది జన్యుపరమైన కారణాల కంటే జీవనశైలికి సంబంధించినదన్నారు.  అధిక స్క్రీన్ టైమ్ వల్ల ఆటిజం, ADHD వంటి సమస్యలు పెరుగుతున్నాయి. విటమిన్ డి, B12, మరియు సి లోపాలు సాధారణం, వీటిని చిన్న వయస్సు నుండే ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా నివారించవచ్చునని డాక్టర్ సురేష్ తెలిపారు.

డాక్టర్లు పాఠశాల స్థాయిలో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాలని సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికలు అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, సగం సమాచారం ప్రమాదకరమని, సరైన వైద్య సలహా అవసరమని వారు వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో IVF సౌకర్యాలను విస్తరించడం, మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చలు,  సమాజంలో సంకోచాన్ని తొలగించడం అవసరమని డాక్టర్ శారదా అభిప్రాయపడ్డారు.      

ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి       

7-10 ఏళ్ల పిల్లలలో ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.  సురక్షిత వాతావరణంలో బహిరంగంగా మాట్లాడేలా పిల్లలను ప్రోత్సహించాలని డాక్టర్ సురేష్  సూచించారు. సెలబ్రిటీలు మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడటం ద్వారా సమాజంలో అవగాహన పెరుగుతోందన్నారు.  కాన్‌క్లేవ్‌లో   పట్టణ జీవనశైలి, ఆహారపు అలవాట్లు,   విద్యాపరమైన ఒత్తిడి వంధ్యత్వం,  ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తున్నాయని  చర్చించారు. పాఠశాలల్లో ఆరోగ్య విద్య, ప్రభుత్వ సౌకర్యాల విస్తరణ, మరియు సామాజిక అవగాహన ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు సూచించారు.       

ఈ డిబేట్ పూర్తి వీడియోనూ ఈ లింక్‌లో చూడవచ్చు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget