ABP Desum Health Conclave 2025: మెడిసిన్స్ లేకుండా నొప్పి తగ్గించుకోవచ్చు - ఆయుర్వేదం ఓ ఆయుధం !
ABP Desum Health Conclave 2025: మందులు వాడకుండా నొప్పి తగ్గించుకోవచ్చు. దానికి మన ఆయుర్వేదం ఎన్నో మార్గాలను చూసిస్తోంది.

ABP Desum Health Conclave 2025: మారుతున్న జీవన విధానం కారణంగా మానవుడికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకసారి వచ్చి పోయేవి కావు. వచ్చి శరీరాన్ని అంటి పెట్టుకుని నొప్పులతో బాధపెట్టేవి ఎన్నో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటే వాటి వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. ఇవేమీ లేకుండా.. నొప్పుల్ని తగ్గించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్‌లో డాక్టర్ బి మస్తాన్ యాదవ్, నేచురోపతి అండ్ పెయిన్ మేనెజ్‌మెంట్ స్పెషలిస్ట్, ఫౌండర్ ఆఫ్ హీలింగ్ హస్త, డాక్టర్ రామకృష్ణ , విశ్వనాథ ఆయుర్వేద వివరించారు.
క్రానిక్ డిసీజెస్ మనుషులు ఎవరికీ ఒక్క సారే రావు. అవి జీవన విధానాన్ని బట్టి వస్తాయి. ఆయుర్వేదం ప్రధానంగా 3 అంశాల మీద ఉంటుంది. వాటిని " త్రయో ఉపస్తంభ " అనవవచ్చు. అంటే మూడు కాళ్లు ఉన్న కుర్చీ అనుకోవచ్చు. ఈ మూడు సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం కూడా బ్యాలెన్స్ ఉంటుంది. మనిషి బాడీ ఆరోగ్యంగాఉండాలంటే ఇవి చాలా ముఖ్యం. ఆ మూడు ఏమిటంటే ఆహారం , నిద్ర , బ్రహ్మచర్యం. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మంచి లైఫ్ స్టైల్ పాటిస్తున్నట్లే. ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం..శారీరక ఆరోగ్యం బాగుంటాయి. అలా ఉంటే క్రానిక్ డీసీజెస్ అనేవి దగ్గరకు రావు అని మస్తాన్ యాదవ్ స్పష్టం చేశారు.
వ్యాధులు రాక ముందే జాగ్రత్త పడాలని ఆయర్వేదం చెబుతుంది. 60 శాతం ఆయుర్వేద బుక్స్ అసలు మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో చెబుతాయి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆయుర్వేద పుస్తకాల్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో వివరించారు. పొద్దున ఎన్ని గంటలకు లేవాలి.. పళ్ళు ఎలా కోముకోవాలి, ఆహారం ఎలా తినాలి.. రోజూ తలకు ఎలా నూనె పెట్టుకోవాలి ఇవన్నీ చాలా క్లియర్ గా ఆయుర్వేద పుస్తకాల్లో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఎవరు పాటిస్తారు?. సూర్యోదయం కాక ముందే నిద్ర లేవాలి.. సూర్యాస్తమయం అయ్యాక వీలైనంత త్వరగా నిద్రపోవాలి. ఈ రోజుల్లో నిద్ర లేక వచ్చే రోగాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్ర లేకపోవడం వల్ల పల్మనరీ వ్యాధులే కాదు.. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. మొత్తం ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంటే నిద్రలేకపోవడం వల్లనే క్రానిక్ డిసీజెస్ పలకరించే అవకాశం ఉందని మస్తాన్ యాదవ్ విశ్లేషించారు.
పెయిన్ మేనెజ్‌మెంట్.. యంటీ ఆసిడ్స్ ఎక్కువ తీసుకుని నిద్ర లేకపోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఎసిడిటీ కోసం యాంటీ ఆసిడ్ తీసుకుంటాం. యాంటీ ఆసిడ్ తీసుకుంటే కాల్షియం సమస్య వస్తుంది.దాని వల్ల కీళ్లు అరిగిపోయి ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఏసీలో కూర్చుంటే ఎండ ఎండ ఎక్కడ నుంచి వస్తుంది..?. వీటన్నింటికీ పరిష్కారాలు ఆయుర్వేదంలోఉంటాయి. మోడర్న్ మెడిసిన్ డెవలప్ అయిన తర్వాత తగ్గింది కానీ మళ్లీ ఇప్పుడు ఆయుర్వేదం కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందుబాటులోకి తెచ్చారు. మోడర్న్ మెడిసిన్ తోటి ఆయుర్వేదం అనేది ఇంటిగ్రేట్ అయి వెళ్తుంది అనుకోవచ్చుని డాక్టర్ రామకృష్ణ వివరించారు.
పెయిన్ కిల్లర్స్ అనేటివి ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, రిహాబిలిటేషన్ చేసుకోవటం వల్ల సింపుల్ గా చాలా అక్యూట్ పెయిన్స్ ని సింపుల్ గా హైడ్రోథెరపీ టెక్నిక్స్ తో మనం బాగా తగ్గించుకోవచ్చు. కోల్డ్ అండ్ హార్ట్ వేరియేషన్స్ తోనే పెయిన్ అక్యూట్ పెయిన్ ని కూడా మనం తగ్గించుకునే టెక్నాలజీ సైంటిఫిక్ గా కూడా బాగా ప్రాచుర్యం పొందింది. 25 ఏళ్ల నుంచి పెయిన్ కిల్లర్స్ లేకుండా హీలింగ్ అస్త ద్వారా ఎలాంటి నొప్పులను అయినా తగ్గిస్తున్నారు. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని నిపుణులు స్పష్టం చేశారు.
ఏబీపీ దేశం హెల్త్ కాంక్లేవ్ లో జరిగిన హీలింగ్ బియాండ్ పిల్స్ టాపిక్ పై పూర్తి చర్చను ఈ లింక్‌లో చూడవచ్చు.






















