Beet Root: బీట్ రూట్‌ని బలవంతంగా కాదు ఇష్టంగా తినండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇదో ఔషధాల గని
బీట్ రూట్‌లో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. బీట్ రూట్ వల్ల మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Beet Root ... చూడ్డానికి మంచి కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. కానీ, ఈ దుంప ముక్కలు లేదా జ్యూస్ తాగాలంటే మాత్రం వామ్మో బీట్ రూట్ జ్యూసా అంటారు చాలా మంది. ఈ మధ్య ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎక్కువైంది కాబట్టి బీట్ రూట్‌తో పాటు ఏదో ఒకటి కాంబినేషన్లో జ్యూస్ చేసేసుకుని, కళ్లు మూసుకుని తాగేస్తున్నారు. బీట్ రూట్‌లో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉన్నాయి. బీట్ రూట్ వల్ల మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి? ఎలా తినాలి? కలిగే ప్రయోజనాలంటి?
* బీట్ రూట్‌లో బీటాలెయిన్స్ అనే ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో పాటు ఆస్టియా అర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు నిత్యం బీట్ రూట్‌ను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
* అలాగే బీట్ రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. మలబద్దకం సమస్య ఉండదు. ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు ఉన్న వారు క్రమంగా తగ్గుతారు.
* బీట్ రూట్‌లో ఉండే నైట్రేట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడులో రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. దీని వల్ల రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో మెదడు పని తీరు మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గించడంలో బీట్ రూట్ సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె పోటు రాకుండా నియంత్రిస్తుంది.
* రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బ్రెయిన్‌కి కావాల్సిన బ్లడ్ సప్లై అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది.
Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి
* బీట్ రూట్ నిత్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. విటమిన్ B6, C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నిషియం, ప్రొటీన్లు, ఐరన్, ఫాస్ఫరస్ బీట్ రూట్‌లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
* రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అధిక ఫ్యాట్‌తో ఇబ్బంది పడేవారు రూట్ జ్యూస్ తాగితే కొవ్వు కరుగుతుంది.
* బీట్ రూట్ గర్భిణీలకు చాలా మంచిది. ప్రెగ్నెంట్స్ కు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ మొత్తం కూడా బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది.
ఇన్ని ప్రయోజనాలున్న బీట్ రూట్‌ను ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి