Fact Check: ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే
Alia Bhatt DeepFake Video: బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోలో ఉన్న అసలు అమ్మాయి ఎవరో వెతికి కనిపెట్టారు నెటిజన్లు.
Alia Bhatt DeepFake Video Fact Check: గత కొంత కాలంగా సినీ సెలబ్రిటీలకు డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర తలనొప్పిగా మారింది. ఇప్పటికే రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ ఈ ఫేక్ వీడియోల బారిన పడగా, తాజాగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ ఈ లిస్టులో చేరింది. ప్రస్తుతం ఆమె డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
నెట్టింట్లో ఆలియా డీప్‌ఫేక్ వీడియో వైరల్
ఈ డీప్ ఫేక్ వీడియోలో ఆలియా లైట్ కలర్ కో-ఆర్డ్ సెట్ వేసుకుని బెడ్‌పై కూర్చుని కెమెరాకు పోజులిచ్చినట్టుగా ఉంది. ఇది సెప్టెంబర్‌లో తొలిసారి షేర్ చేయబడినట్లు తెలుస్తోంది. అదే వీడియో ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అసలు వీడియో ఇండోనేషియా FB పేజీలో కనిపించింది. నిజానికి ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే, ఫేక్ వీడియో అని ఇట్టే అర్థం అవుతోంది. వీడియోలో ఆలియా భట్ లిప్ సింక్ సరిగా ఉండదు. అలాగే, వీడియోలోని చాలా చోట్ల ఆమె ముఖం ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తుంది.
వీడియోలో ఉన్నది ఇండోనేషియా యువతి
ఇక నెటిజన్లు ఆలియా డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన అసలు వీడియోను గుర్తించారు. ఇందులో ఉన్న యువతి అలియా భట్ కాదు. అసలు వీడియోలో ఉన్న యువతి తన ఫేస్‌బుక్ పేజీలో ఈ క్లిప్‌ను షేర్ చేసింది. ఆమె అదే డ్రెస్సులో మరో వీడియోను కూడా షేర్ చేసింది. ఆ పేజీలో ఉన్న ఫోన్ నెంబర్ లో ఇండోనేషియన్ కాలర్ కోడ్ కూడా ఉంది. ఈ ఫేస్‌బుక్ పేజీలో మరొక మహిళ షేర్ చేసిన వీడియోలో అలియా భట్ ముఖం సూపర్మోస్ చేయబడిందని తెలుస్తోంది.
This #deepfake video of Alia Bhatt has gone viral in which #AliaBhatt seems to be a victim. These sites should be banned because it will defame anyone. So I request the government to ban such sites. And strictest action should be taken against whoever posted such edited video. pic.twitter.com/TynmlJEU6P
— Kavya 🥀💌 (@Kavvyia) November 27, 2023
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్ అయినా...
గత నెలలో రష్మిక మందన్న, కాజోల్ సహా పలువురు భారతీయ నటీనటులు ఫేక్ వీడియోల బారినపడ్డారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇలాంటి వీడియోలను అడ్డుకోకపోతే, మహిళలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ వీడియోలకు అడ్డుకట్ట వేయాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేంద్రాన్ని కోరారు. రీసెంట్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ డీప్ ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లకు కొత్త రూల్స్ విధించింది. నిబంధనలు అధిగమిస్తే, జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా, డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట్లోకి వస్తూనే ఉన్నాయి.
Read Also: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply