News
News
X

Yuva Movie: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబం నుంచి మరో హీరో - ‘యువ’గా ఎంట్రీ ఇస్తున్న వారసుడు

కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ నటిస్తున్న తొలి సినిమా టైటిల్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘యువ’ అనే పేరు ఖరారు చేశారు.

FOLLOW US: 
Share:

కన్నడ చిత్ర పరిశ్రమ లోకి మరో కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ రెండో కుమారుడు రాఘవేంద్ర తనయుడు యువ రాజ్ కుమార్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఆయన ఎంట్రీ గురించి శాండిల్ వుడ్ లో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఆ యువ హీరో ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అభిమానులకు శుభవార్త అందింది. యువ రాజ్ కుమార్ నటిస్తోన్న తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన హంబలే ఫిల్స్మ్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా పేరును ‘యువ’గా ఖరారు చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్, పోస్టర్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక ఈ సినిమా పోస్టర్, టీజర్ లో యువ రాజ్ కుమార్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే మూవీ భారీ యాక్షన్ మూవీ గా కనిపిస్తోంది. టీజర్ లో యువ రాజ్ కుమార్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంది. సినిమా భారీ గ్యాంగ్ వార్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలా ఉందని టీజర్ చూస్తే తెలుస్తోంది. అలాగే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా యువరాజ్ కుమార్ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ మూవీ మంచి ట్రీట్ అనే చెప్పొచ్చు. టైటిల్, టీజర్ తో సినిమా విడుదల తేదీను కూడా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 22 న ఈ మూవీను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొదట్లో ఈ సినిమాకు 'జ్వాలాముఖి' లేదా 'అశ్వమేధ' అనే టైటిల్‌ని పెట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా హీరో పేరునే మొదటి సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారు. 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన అభిమానులు యువ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీకు పరిచయం చేయాలని కోరారు. అభిమానులు కోరుకున్నట్టే పునీత్ వారసత్వాన్ని కొనసాగించేలా యువ రాజ్ కుమార్ సినీ అరంగేట్రం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ బాల నటుడిగా పలు సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా 2002 లో ‘అప్పు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి పునీత్ ను ఇంట్లో అందరూ అప్పు అని పిలవడంతో ఆ పేరునే పునీత్ మొదటి సినిమాకు పెట్టాలని కుటుంబ సభ్యులు సూచించారు. అప్పటి నుంచి ఆయన్ను అందరూ అప్పు అని పిలుస్తున్నారు. అలాగే ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇచ్చిన యువ రాజ్ కుమార్ అసలు పేరు గురు రాజ్ తర్వాత యువ రాజ్ కుమార్ గా పేరు మార్చుకున్నాడు. అప్పటినుంచి ఇంట్లో అందరూ యువ అని పిలుస్తుండేవారు. సరిగ్గా పునీత్ లానే యువ రాజ్ కుమార్ సినిమా కెరీర్ కూడా తన మొదటి సినిమాకు ‘యువ’ అనే పేరునే పెట్టుకోవడంతో పునీత్ వారసత్వాన్ని యువ కొనసాగిస్తాడు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే పునీత్ కోసం సిద్దం చేసిన కథనే కొన్ని మార్పులు చేసి యువ రాజ్ కుమార్ తో ఈ ‘యువ’ సినిమా చేస్తున్నారట దర్శకుడు సంతోష్. దీంతో ఈ మూవీ పై మరింత ఉత్కంఠ పెరిగింది.  

View this post on Instagram
 
A post shared by Hombale Films (@hombalefilms)

Published at : 03 Mar 2023 09:11 PM (IST) Tags: Puneeth Rajkumar Hombale films Yuva Yuva Rajkumar

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌