అన్వేషించండి

Teacher Movie: #90s దర్శకుడితో కలర్స్ స్వాతి మూవీ - ఫస్ట్ టైమ్ అలాంటి బోల్డ్ పాత్రలో కనిపించనుందా?

'నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ తో పాపులరైన డైరెక్టర్ ఆదిత్య హాసన్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో ‘టీచర్‘ అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

Aditya Is Materialising A Film Titled Teacher: #90s - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ తో ఓ రేంజిలో పాపులర్ అయ్యాడు యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్. ఈటీవీ విన్‍ ఓటీటీ వేదికగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ జనాలను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‍ను ఆదిత్య తెరకెక్కించిన విధానం వారెవ్వా అనిపించింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

‘టీచర్‘ సినిమా కథేంటంటే?

ప్రస్తుతం ఆదిత్య హాసన్ కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘టీచర్‘ అనే పేరు ఖరారు చేశారు. ఇక ఈ సినిమాను కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నట్లు సమాచారం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుల పువ్వులు పూయనున్నట్లు తెలుస్తోంది. ఓ పల్లెటూరుకు చెందిన నలుగురు విద్యార్థులు చదువులో బాగా వెనుకబడుతారు. బాగా అల్లరి చేస్తారు. ఈ విద్యార్థులు టీచర్ ను కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారిపోయాయి? అనే కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

‘టీచర్‘ సినిమా కూడా సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ వార్త సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. స్వాతి ఇందులో ఫస్ట్ టైమ్ బోల్డ్ పాత్రలో కనిపించనుందని తెలిసింది. అయితే, అదేమిటనేది దర్శకనిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమాను ఎంఎన్‌ఓపీ సంస్థ నిర్మిస్తున్నది. కలర్స్ స్వాతి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిఖిల్‌ దేవాదుల, నిత్య శ్రీ, రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌, హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అజీమ్‌ మహమ్మద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సిద్ధార్థ్‌ సదాశివుని మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. 

ఆకట్టుకున్న 'నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'

'నైంటీస్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' విమర్శకులతో పాటు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆదిత్య హసన్‌ ఈ వెబ్ సిరీస్ ను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. వినోదం మాత్రమే కాదు... మధ్య తరగతి కుటుంబాల్లో సందర్భాలను దర్శకుడు ఆదిత్య హాసన్ హృద్యంగా ఆవిష్కరించారు. సిరీస్ చూసిన చాలా మంది తమకు తమ బాల్యం గుర్తుకు వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆ సిరీస్ కేవలం యువతీ యువకులను మాత్రమే కాదు... పెద్దలను కూడా అమితంగా ఆకట్టుకుంది. ఇంటిల్లిపాది చూసే క్లీన్ కామెడీని ఆదిత్య హాసన్ అందించారు.  'నైంటీస్' వెబ్ సిరీస్ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget