One Rupee Ticket: ఆ సినిమా టికెట్ రేట్ ఒక్క రూపాయే... చూస్తారా మరి?
సినిమా చూడాలంటే మినిమమ్ వంద రూపాయలు పెట్టాల్సిన రోజుల్లో ఒక్క రూపాయికి సినిమా చూపిస్తామని ఓ దర్శకుడు అంటున్నారు.
మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూడాలంటే మినిమమ్ 150 రూపాయలు పెట్టాల్సిన రోజులు ఇవి. సింగిల్ స్క్రీన్స్ అయితే కనీసం రూ. 75, రూ. 100 పెట్టాలి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్స్ చెప్పిన దానికంటే తక్కువ ఉన్నాయనుకోండి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కూడా ఉన్నాయి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకోవాలన్నా కనీసంలో కనీసం నెలకు వంద రూపాయలు కావాల్సిందే. అయితే... ఓ దర్శకుడు ఒక్క రూపాయికి తన సినిమా చూపిస్తానని చెబుతున్నారు.
వ్యవసాయం నేపథ్యంలో దర్శకుడు దినేష్ నర్రా రూపొందించిన సినిమా 'ఏవమ్ జగత్'. కిరణ్ గేయ, 'ప్రకృతివనం' ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన తారలుగా మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు .ఎన్, రాజేశ్వరి .ఎన్ చిత్రాన్ని నిర్మించారు. ఒకే ఒక్క రూపాయితో ఆన్‌లైన్‌లో సినిమా చూడమని చిత్రబృందం కోరుతోంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 16న సాయంత్రం ఆరు గంటలకు 'aevum jagat' డాట్ కామ్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. లేదంటే పోస్టర్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా చూడాలనుకున్న వారు సైట్‌లోకి వెళ్లి రూపాయి కడితే లింక్ వస్తుంది. అప్పుడు సినిమా చూడొచ్చు. సేంద్రియ వ్యవసాయం, పల్లె వాతావరణం విస్మరించి కృతిమ వ్యవసాయం చేస్తే భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు దినేష్ నర్రా తెలిపారు. కుటుంబ అనుబంధాలకు కూడా సినిమాలో ప్రాముఖ్యం ఇచ్చామని చెప్పారు. ఈ చిత్రానికి శివ కుమార్ సంగీత దర్శకుడు.
https://t.co/2LCUw3jcI5
— Mars Productions Ltd (@MarsProduction7) January 3, 2022
తెలివైన వాళ్ళని పట్టణాలకి తరిమెసే, పల్లెటూర్లు నాశనం అయ్యిపోయాయి. ఇక వ్యవసాయం పై యువతకి ఆసక్తి ఎలా వస్తుంది..?
Watch #Aevumjagat trailer #happyfarmers #grassrootsinnovation
Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి