అన్వేషించండి

Samantha: సమంతకు మళ్లీ బ్రదర్‌గా టాలీవుడ్ హీరో - ఈసారి బాలీవుడ్‌లో

పాన్ ఇండియా సినిమాలో సమంతకు వరుసకు సోదరుడు అయ్యే పాత్రలో యంగ్ టాలీవుడ్ హీరో ఒకరు నటించారు. ఇంకోసారి ఆమెకు బ్రదర్ రోల్ చేసే అవకాశం, అదీ బాలీవుడ్‌లో అతడికి వచ్చిందని తెలిసింది.

సమంత స్టార్ హీరోయిన్. సారీ సారీ... పాన్ ఇండియా హీరోయిన్. ఆమెతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు కోరుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక టాలీవుడ్ యంగ్ హీరోకి సమంతతో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే... ఆమెకు జోడీగా కాదు! ఆమెకు వరుసకు బ్రదర్ అయ్యే రోల్ చేశారు. మరోసారో అతడికి అటువంటి ఆఫర్ వచ్చిందని, ఈసారి బాలీవుడ్‌లో అని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

సమంత బ్రదర్ క్యారెక్టర్‌లో యశ్ పూరి!
'శాకుంతలం' సినిమా గుర్తు ఉందా? అందులో కీలక పాత్ర చేసిన యష్ పూరి గుర్తు ఉన్నారా? అదేనండీ... 'చెప్పాలని ఉంది' సినిమాలో హీరోగా నటించారు. జిబ్రిష్ టైప్ లాంగ్వేజ్ మాట్లాడారు కదా! 'అలాంటి సిత్రాలు' యాంథాలజీ సినిమాలోనూ ఓ కథలో నటించారు.

కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల ఉంటుంది కదా! అక్కడ మహర్షి శిష్యులలో యష్ పూరి ఒకరు. కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాల్లో ఆయన నటించారు. 'సోదరి శకుంతలకు ఇక శాపం తొలగినట్టే' అని డైలాగ్ కూడా చెబుతారు. ఇప్పుడు ఆయన మరోసారి సమంతతో కలిసి నటించారు. 

'ఫ్యామిలీ మ్యాన్' వంటి సూపర్ డూపర్ హిట్ వెబ్ సిరీస్ తీసిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'. హిందీ హీరో వరుణ్ ధావన్, పాన్ ఇండియా స్టార్ సమంత అందులో ప్రధాన తారాగణం. ప్రజెంట్ దానికి డబ్బింగ్ చెప్పే పనిలో సామ్ బిజీగా ఉన్నారు. ఆ వెబ్ సిరీస్‌లో యష్ పూరి కూడా నటించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

'సిటాడెల్' సినిమాలోనూ సమంత బ్రదర్ పాత్రలో యష్ పూరి నటించారని వెబ్ సిరీస్ సన్నిహిత వర్గాల సమాచారం. అయితే... ఇంకా అధికారికంగా ఆ విషయాన్ని చెప్పలేదు. ఎందుకో సీక్రెట్‌గా ఉంచారు. సస్పెన్స్ / సర్‌ప్రైజ్‌గా వెబ్ సిరీస్‌లో రివీల్ చేస్తారేమో!? ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' కొందర్ని ఆకట్టుకుంది. మరి, సమంతకు ఎటువంటి పేరు వస్తుందో చూడాలి.

Also Readత్వరలో సర్జరీకి రెడీ అవుతున్న 'బిగ్ బాస్' అభిజీత్‌... ఆయనకు ఏమైందంటే?

View this post on Instagram
 
A post shared by Hamstech Films (@hamstechfilms)

యష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా 'హ్యాపీ ఎండింగ్'. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో తెలుగమ్మాయి అపూర్వ రావు హీరోయిన్. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. పురాణాల్లో పాయింట్ తీసుకుని... శాపం వల్ల ఓ యువకుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనే కథతో 'హ్యాపీ ఎండింగ్' తెరకెక్కించారు. ఈ సినిమాలో మేకప్ ఆర్టిస్ట్ పాత్రలో యష్ పూరి నటించారు. హీరోయిన్ అపూర్వ రావుది యోగా ట్రైనర్ రోల్. ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 'హ్యాపీ ఎండింగ్' సినిమా మంచి వినోదం అందిస్తుందని, పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడవచ్చని యష్ పూరి చెబుతున్నారు.

Also Readధనుష్, నాగార్జున సినిమా టైటిల్ ఫిక్స్ - అందులో కింగ్ రోల్ ఏమిటంటే?

Samantha: సమంతకు మళ్లీ బ్రదర్‌గా టాలీవుడ్ హీరో - ఈసారి బాలీవుడ్‌లో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget