అన్వేషించండి

Will Smith: క్రిస్ రాక్‌కు మరోసారి క్షమాపణలు చెప్పిన విల్ స్మిత్!

విల్ స్మిత్ తను చేసిన పనికి సిగ్గుపడుతూ క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు.

ఆస్కార్ వేడుకల్లో నటుడు, కమెడియన్ క్రిస్ రాక్ మీద విల్ స్మిత్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. వీక్షకులకు వినోదం పంచే క్రమంలో క్రిస్ రాక్ తన భార్య పేరు తీసుకు రావడాన్ని విల్ స్మిత్ సహించలేకపోయారు. నేరుగా వేదికపైకి వెళ్లి చెంపదెబ్బ కొట్టారు. విల్ స్మిత్ చేసిన పనికి అతడిపై చర్యలు తీసుకుంది ఆస్కార్స్ అకాడమీ బోర్డ్. ఈ స్టార్ హీరో పదేళ్ల పాటు ఆస్కార్ పురస్కార వేడుకలు సహా అకాడమీ నిర్వహించే ఏ కార్యక్రమాలకూ హాజరు కాకూడదని నిషేధం విధించింది. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు విల్ స్మిత్ పేర్కొన్నారు. 

ఇప్పటికే విల్ స్మిత్ తను చేసిన పనికి సిగ్గుపడుతూ క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఈ విషయంలో చాలా మంది విల్ స్మిత్ ను ట్రోల్ చేశారు. అతడి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక.. క్రిస్ రాక్ ను కొట్టడాన్ని వేలెత్తి చూపించారు. ఈ ఇన్సిడెంట్ విల్ స్మిత్ కెరీర్ పై కూడా ప్రభావం చూపించింది. 

ఇప్పుడు మరోసారి క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు విల్ స్మిత్. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశారు విల్ స్మిత్. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలను సమాధానాలు చెప్పారు. క్రిస్ రాక్ తో మాట్లాడారా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అతడితో మాట్లాడానికి ప్రయత్నించాను. కానీ క్రిస్ నాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అతను మాట్లాడాలనుకున్నప్పుడు నేను కచ్చితంగా మాట్లాడతాను. మరోసారి క్రిస్ కి ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. 

అలానే తను చేసిన పని కారణంగా ఇంతమంది బాధపడతారని ఊహించలేదని.. ఇప్పుడు జరిగినదాన్ని మార్చలేనని అన్నారు. స్టేజ్ పై అలా ప్రవర్తించడం కరెక్ట్ అని తను అనుకోవడం లేదని.. అగౌరవాన్ని, అవమానాన్ని అలా హ్యాండిల్ చేయకూడదని అన్నారు. క్రిస్ రాక్ తో అలా ప్రవర్తించిన విషయంలో తన భార్య ప్రమేయం లేదని, అది పూర్తిగా తన నిర్ణయమని తెలిపారు. ఈ క్రమంలో తన భార్య, పిల్లలకు కూడా క్షమాపణలు చెప్పారు. తన కారణంగా వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు విల్ స్మిత్. అలానే క్రిస్ రాక్ తల్లిని, అతడి కుటుంబాన్ని క్షమాపణలు కోరారు.

Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?

Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Will Smith (@willsmith)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Pirated Content Consumption: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
Embed widget