By: ABP Desam | Updated at : 12 Aug 2023 10:52 AM (IST)
Photo Credit: Samantha/Instagram
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ‘ఖుషి’ ట్రైలర్ విడుదలై, ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, హీరోయిన్ సమంత ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సమంత, వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. బాలిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. తన మిత్రురాలితో కలిసి అక్కడి అందాలను తిలకిస్తోంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. తన యాక్టివిటీస్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటోంది. తన చికిత్స కోసం ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఆర్థిక సాయం చేస్తున్నాడంటూ వచ్చిన వార్తలపైనా ఆమె స్పందించింది. కానీ, తన తాజా చిత్రం ‘ఖుషి’ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. ఆగష్టు 9న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ వేడుకలో ఆమె పాల్గొనలేదు. సరే వెకేషన్ లో ఉన్నందున రాలేదు అనుకున్నా, కనీసం సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించి ప్రస్తావించలేదు.
‘ఖుషి’ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌గా కామెంట్స్ వస్తున్నాయి. కానీ, సమంత మౌనంగా ఉండటం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, సామ్ ఏప్రిల్‌లో 'శాకుంతలం' చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది. వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ. 'ఖుషి' గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడే సమయంలోనైనా రెస్పాండ్ అవుతుందో? లేదో? చూడాలి.
ఇక ‘ఖుషి’ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. పాటలు అందరినీ అద్భుతంగా అలరించాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అందరినీ అలరించింది. 'మహానటి' తర్వాత సమంత -విజయ్ దేవరకొండ కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేశారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also: ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకండి - లక్ష్మీ మీనన్‌తో పెళ్లి వార్తలపై విశాల్ ఆగ్రహం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>