(Source: ECI/ABP News/ABP Majha)
What IF RRR in Oscar Nominations : ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' ఉండుంటే?
ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి గాను 'ఛెల్లో షో'ను పంపించారు. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ బరిలో ఉండుంటే...?
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా మీద జాలి చూపించే వాళ్లు... RRR కోసం ఎమోషనల్ అయిపోతున్న చాలా మందే ఉన్నారు. 'ఛెల్లో షో'ను ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌కు పంపడం వెనుక 'ఆర్ఆర్ఆర్'ను ఎందుకు పంపలేదని చాలా మంది అడుగుతున్నారు. చర్చిస్తున్నారు. కొంత మంది 'ఆర్ఆర్ఆర్'లో నిజంగా అంత సరుకు ఉంటే వెళ్లేదని... మరికొంత మంది ఏమో ఆస్కార్ ఏమన్నా 'ఆర్ఆర్ఆర్'కి వెస్ట్రన్ వేలిడేషనా? అది వస్తే ఎంత రాకపోతే ఎంత? అని రెండు వైపులా మాట్లాడుతున్నారు.
అసలు 'ఆర్ఆర్ఆర్' వెళ్లి ఉంటే ఏం జరిగేది? ఎంత గొప్ప అవకాశాన్ని తెలుగు సినిమా మిస్ అయ్యింది? కాస్త వివరంగా చూద్దాం!
సినిమా చూసే ధోరణి మారేది!
ఒకప్పుడు అవార్డులు వచ్చిన సినిమా అంటే ఆర్ట్ హౌస్ మూవీస్, సెన్సిబుల్ సోషల్ డ్రామాలు, సోఫిస్టికేటెడ్ స్టోరీ టెల్లింగ్ అనే నిశ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల గ్లోబల్ రీచ్ పెరిగింది. కమ్యూనికేషన్ అరచేతిలోకి వచ్చిన తర్వాత ఈస్ట్, వెస్ట్ అనే తేడా లేకుండా అన్ని సినిమాలను అందరూ చూస్తున్నారు. ఇలాంటి టైంలో స్టోరీ టెల్లింగ్ లో కన్విక్షన్ అనేది మాత్రమే మ్యాటర్ అవుతోంది. మరో విషయం ఏంటంటే సినిమాల పరంగా ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు హాలీవుడ్ అంటే సూపర్ హీరోలు, ఫాంటసీ వరల్డ్స్ క్రియేట్ చేస్తారనే గుర్తింపు ఉంది. అలానే జపాన్ అంటే యానిమేషన్, కొరియన్ అంటే కే డ్రామా లాంటి గుర్తింపు ఉంది. కానీ, మన దేశంలో మెయిన్ స్ట్రీమ్ మసాలా సినిమాలను ఎవరూ తీయలేరనేది నిజం. ప్రత్యేకించి మన సౌతిండియన్ సినిమాలు RRR లాంటి మసాలా సినిమాలు తీయటంలో మాస్టర్ చేశాయి. రాజమౌళి లాంటి క్రియేటివ్ జీనియస్ చేతిలో పడిన సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులను శాటిస్ ఫై చేస్తాయి. సాంగ్స్, డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్, స్క్రీన్ ప్లే ఇలా ఏ పాయింట్ నుంచి అన్ డౌటెడ్ లీ అకాడమీని ఇంప్రెస్ చేయగల సత్తా ఉన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. సో... 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమా ఆస్కార్క్ కి వెళ్లి ఉంటే కచ్చితంగా నామినేషన్స్ లోకి వెళ్లేదని చాలా మంది క్రిటిక్స్, డైరెక్టర్స్ మూవీ లవర్స్ ఊహించిన అంశం. ఫలితంగా వెస్ట్రనైజేషన్ లేని ఓ అథంటిక్ ఇండియన్ స్టోరీని గ్లోబల్ ఆడియన్స్ చూసే అవకాశం దక్కేది. ఇండియన్ మూవీస్ అంటే ఓ భారీ మాస్ మసాలా యాక్షన్ సినిమా అనే గుర్తింపు వచ్చి ఉండేది.
'ఆర్ఆర్ఆర్' ఫెమీలియారిటీ... పాపులారిటీ!
గడచిన ఇరవై ఏళ్లలో కనీసం ఆస్కార్ నామినేషన్ కూడా పొందలేకపోతున్నాం మనం. 2001 లగాన్ సినిమా తర్వాత కనీసం నామినేషన్స్ లోకి వెళ్లిన భారతీయ సినిమా లేదు. దీనికి ప్రధాన కారణంగా వరల్డ్ ఫిలిం క్రిటిక్స్ చెబుతున్న విషయం అన్ ఫెమీలియారిటీ. ఉదాహరణకు 2013 లో విడుదలైన 'లంచ్ బాక్స్' సినిమాకు వరల్డ్ వైడ్ అప్లాజ్ వచ్చింది. మెథడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ ను కాదని ఆ ఇయర్ 'ది గుడ్ రోడ్' అనే గుజరాతీ మూవీని ఆస్కార్ కు అఫీషియల్ గా ఇండియా నుంచి పంపించారు. కానీ ఇక్కడే మర్చిపోయిన ఇంకో విషయం ఏంటంటే 'స్లమ్ డాగ్ మిలీనియర్', 'లైఫ్ ఆఫ్ పై', 'జూరాసిక్ పార్క్' లాంటి సినిమాలతో 'ఇర్ఫాన్ ఖాన్' హాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం. సో, అలాంటి వ్యక్తి చేసిన 'లంచ్ బాక్స్' అయ్యుంటే ఆ ఫెమీలియారీటి సినిమా షార్ట్ లిస్ట్ అవ్వటానికి ఉపయోగపడి ఉండేదేమో కానీ అలా జరగలేదు. తమిళ్ 'విశారణై', మలయాళం 'జల్లికట్టు' ఇవన్నీ మంచి సినిమాలే. కానీ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదు అంటే? వరల్డ్ వైడ్ పాపులారిటీ లేకపోవటమే. ఒక్కసారి వెళ్లాక ప్రమోషన్ చేసుకుందామన్నా దానికి సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. దానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడు?
హాలీవుడ్ మెచ్చిన సినిమా!
'ఆర్ఆర్ఆర్' విషయంలో అంతా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చింది టీం. సోషల్ మీడియా టీంగా RRR బృందం చేసిన ప్రమోషన్లు రీసెంట్ టైమ్స్ లో ఏ ఇండియన్ సినిమాకు జరగలేదు. అసలు గడిచిన ఆర్నెల్లుగా RRR గురించి మాట్లాడనది ఎవరు? రూసో బ్రదర్స్ దగ్గర నుంచి హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు తీసే ఫ్రాంచైజీలు... వాటి రైటర్స్ వరకూ 'ఆర్ఆర్ఆర్'ని ఓ రోలర్ కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 'ఆర్ఆర్ఆర్'కి వచ్చినన్ని రివ్యూలు, సీన్ టూ సీన్ మాస్టర్ చేసిన వీడియోలు రీసెంట్ టైమ్స్ లో ఏ సినిమాకు రాలేదు. సో రేపు అకాడమీ వాళ్ల కోసం అక్కడ స్పెషల్ షోలు వేయాల్సిన పని కూడా లేదు. ఓట్లేయాల్సిన అకాడమీ మెంబర్స్ లో కూడా చాలా మందికి 'ఆర్ఆర్ఆర్' తెలిసే ఉంటుంది. అలాంటి సినిమా అఫీషియల్ సబ్మిషన్ లో ఉంటే ఓట్లు పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అలాంటి సినిమా కాదని 'ఛెల్లో షో' లాంటి సినిమాను పంపించారు. ఈ సినిమా ఎంత మంచిదైనా ప్రచారం లేకపోతే గతంలో ఎదురైన అనుభవాలే మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆస్కార్ ఏమన్నా రాజముద్రా?
ఆస్కార్ వస్తే మంచి సినిమా అని, లేదంటే కాదని కాదు! అసలు ఇక్కడ ఉద్దేశం కాదు. అసలు అవార్డు అంటేనే అప్రిసియేషన్. ఆస్కార్ లాంటి గ్లోబల్ రినౌన్డ్ అవార్డు వస్తే ఆ సినిమాకు ఓ ఎక్స్ పోజర్, ఆ డైరెక్టర్ కు ఓ క్రెడిబులిటీ వస్తుంది. ఉదాహరణకు కొరియన్ 'పారసైట్' సినిమా తీసుకుంటే అఫీషియల్ సబ్మిషన్ గా వెళ్ళినప్పుడు ఆ సినిమా ఎవరికీ తెలియదు. కానీ, 'పారసైట్' ఆస్కార్ గెలుచుకున్న తర్వాత అన్ని దేశాల్లోనూ ఆ పేరు మోగిపోయింది. చాలా మంది అప్పటి వరకు కొరియన్ సినిమాలు చూడని వాళ్ళు కూడా ఆస్కార్ వచ్చిందని చూడటం మొదలు పెట్టారు. Western Validation పెరామీటరా అంటే కాదు కానీ ఆస్కార్ వస్తే
యూనివర్సల్ అప్రిసియేషన్ అనే చెప్పుకోవాలి. వెస్ట్రన్ వరల్డ్ నుంచి వచ్చిన 'టైటానిక్', 'జురాసిక్ పార్క్'ని మారుమూల పల్లెటూరు ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేశారు. మనం ఆ ప్రపంచంతో కనెక్ట్ కాలేకపోవచ్చు. కానీ, ఆ ఎమోషన్ తో కనెక్ట్ అవుతాం. సో, మన సినిమా కూడా గ్లోబల్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యేది. ఇండియా అంటే బాలీవుడ్ అని... ఫ్యాన్సీ డ్యాన్స్ సీక్వెన్సులని విదేశీ ప్రేక్షకులలో ఉన్న అభిప్రాయాలన్నీ బద్దలయ్యేవి.
Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!
కల్చరల్ ఎక్స్ ఛేంజ్ & గ్లోబల్ మార్కెట్!
ప్రపంచంలో హాలీవుడ్ ను మించి సినిమాలను రూపొందిస్తున్న ఇండస్ట్రీలో ఇండియా ఒకటి. మిగిలిన ఏ కంట్రీకి లేని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే... మనది వన్ కంట్రీ - మల్టిపుల్ లాంగ్వేజెస్. మన దేశంలో వేర్వేరు భాషల్లో వచ్చినన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం నుంచి రావు. సో అంతటి డైవర్స్ అండ్ రిచ్ కల్చర్ మనది. సో అలాంటి మన దేశం నుంచి వెళ్లిన ఓ తెలుగు సినిమా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ కనుక పొంది ఉంటే గ్లోబల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా ఇంకాస్త పుష్ అయ్యేది. ఏఆర్ రెహమాన్ ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మనకందరికీ తెలుసు. తను చేసిన పాటల్లో 'జయహో' సాంగే ది బెస్ట్ కాదనే విషయం కూడా మనకు తెలుసు. కానీ, 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు రెండు ఆస్కార్ లు అందుకున్న తర్వాత ఏఆర్ రెహమాన్ కు వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ వచ్చింది. ఆయన మిగిలిన పాటలను, సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సినీ సంగీత అభిమానులు చూశారు. విన్నారు. రెహమాన్ ఆ తర్వాత ఎనిమిది హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ఇదంతా టెక్నికల్ అడ్వాన్స్ మెంటే కదా. భారతీయ సంగీతానికి ప్రపంచ వేదికపై దక్కిన గౌరవమే కదా. ఇప్పుడు RRR లాంటి సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉంటే దాని ప్రభావం రాజమౌళి తర్వాతి సినిమాలపైనా పడేది. ఉదాహరణకు మహేష్ తో రిలీజ్ చేసే గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేది. ఇదంతా ఇండియన్ మూవీకి దక్కే గ్లోబల్ అప్రిసియేషనే కదా.
ఆస్కార్ ఎందుకు గ్లోబల్ బెంచ్ మార్క్ అనే దానికి ఇవీ కారణాలు. ఇప్పుడు 'ఛెల్లో షో'పైన ఇదే మాత్రం నెగిటివిటీ కాదు. 'ఆర్ఆర్ఆర్'కి ఉన్న పాజిటివ్స్ అండ్ ఫెమిలీయారిటీ గురించి చెప్పటమే మా ప్రయత్నం.