అన్వేషించండి

అందుకే విజయ్ దేవరకొండను ఈ మూవీలోకి తీసుకోలేదు: నందిని రెడ్డి

'అన్నీ మంచి శకునములే' సినిమాలో ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నామని డైరెక్టర్ నందిని రెడ్డి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విజయ్‌ను ఈ మూవీలోకి ఎందుకు తీసుకోలేదో చెప్పారు.

Nandini Reddy: 'అన్నీ మంచి శకునములే' సినిమాలో సంతోష్ శోభన్ కంటే ముందు రౌడీ హీరో విజయ్ దేవరకొండను అనుకున్నామని టాలెంటెడ్, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పారు. ఈ కథ విజయ్ కి కూడా నచ్చిందని తెలిపారు. కానీ అప్పటికీ విజయ్ స్టార్ స్టేటస్ మారిపోయిందని, ఏజ్ ఫ్రొఫైల్ మారిపోయిందన్నారు. బాయ్ నుంచి అతని లుక్ మారిపోయిందని, అందుకే తాము ఇక నిర్ణయం మార్చుకున్నట్టు నందిని రెడ్డి తెలిపారు.

తన సినిమాల్లో దాదాపు 24 ఏళ్ల వయసున్న వారినే ప్రధాన పాత్రలుగా ఎంచుకోవడంపై నందిని రెడ్డి స్పందించారు. అది తనకు తెలియకుండానే జరుగుతుందని, కావాలని అలా సెలెక్ట్ చేయడం లేదని చెప్పారు. బహుశా తాను ఆ 24 ఏజ్ వద్ద స్ట్రక్ అయిపోయానేమోనంటూ నవ్వుతూ అన్నారు. నిజానికి ఇది చాలా నైస్ ఏజ్ అని, అది ఒక ట్రాన్సిషియన్స్ ఏజ్ అని ఆమె చెప్పారు. చైల్డిష్ నెస్ పోయి, అడల్ట్ మెచ్యూరిటీ నుంచి ట్రాన్సిషన్ చేస్తున్న ఏజ్ అది.. అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే ఆ ఏజ్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయినా మధ్యలో 'ఓ బేబీ' కూడా చేశాను కదా అని ఆమె క్లారిటీ ఇచ్చారు.

'అన్నీ మంచి శకునములే' మూవీ గురించి నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కథను నేను ఎప్పుడో రాసుకున్నాను. ముందు విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా. తను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోయింది. ఇలాంటి సాఫ్ట్ రోల్ అతనికి కరెక్ట్ కాదని.. నేను, నిర్మాత స్వప్న దత్ ఫీలయ్యాం. అదే విషయాన్ని విజయ్ కి చెప్పాను. ఆ తర్వాత నేను 'ఓ బేబీ' మూవీ చేశాను. అది పూర్తయ్యాక కొవిడ్ వల్ల రెండేళ్లు వృథా అయ్యింది. ఇక ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు నటీనటుల కోసం వెతుకుతున్నప్పుడు సడన్ గా సంతోష్ పేరు తెరపైకి రాగానే, వెంటనే స్క్రీన్ టెస్ట్ చేశాను. అతను ఈ రోల్ కి సరిగ్గా సెట్ అయ్యాడు అని నందిని రెడ్డి వివరించారు.

సున్నితమైన ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో ప్రసిద్ధి గాంచిన డైరెక్టర్ నందిని రెడ్డి.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు 'అన్నీ మంచి శకునములే' ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తుండగా... మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో కొన్ని రోజులుగా మేకర్స్ తో పాటు సినిమాలో నటించిన నటీనటులు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. నందిని రెడ్డి రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు హీరో నాని గెస్ట్ గా మారి, సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మూవీలోని సాంగ్స్, ప్రోమోలు బాగున్నాయని నాని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని.. ఈ మూవీ కోసం స్వప్న దత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు. కాగా ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది.

Also Read: నా తల్లి ఎదుర్కొన్న నరకయాతన మరే తల్లికి రాకూడదు - ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య భావోద్వేగం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Bollywood Rewind 2024: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
Embed widget