News
News
X

Good Luck Sakhi Video Song: రావే రావే సఖి... మురిసే ముచ్చట్లకి... సరదా సయ్యాటకి!

కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్ లుక్ సఖి'. ఇందులో 'బ్యాడ్ లక్ సఖి' వీడియో సాంగ్ ఈ రోజు విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

నగనగా ఓ అమ్మాయి... ఆమె పేరు సఖి. ఊరంతా ఆమెను 'బ్యాడ్ లక్ సఖి... బ్యాడ్ లక్ సఖి' అంటుంటారు. ఎందుకు? అనేది 'గుడ్ లక్ సఖి' సినిమా చూస్తే తెలుస్తుంది. ఆమెను 'బ్యాడ్ లక్ సఖి' అనడం మీద ఓ సాంగ్ రూపొందించారు.  'రావే రావే సఖి... మురిసే ముచ్చట్లకి... సరదా సయ్యాటకి' అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హరిప్రియ, సమీరా భరద్వాజ్, ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్ ఆలపించారు.

'ఇంకెన్నాళ్లే సఖి... నీ పప్పన్నానికి... త్వరగా పో మగనికి...' అంటూ సఖికి ఓ మహిళ చెప్పడం చూస్తుంటే... సఖి పెళ్లి కోసం ఊరిలో జనాలు అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పడానికి ఓ సంకేతంగా చూడవచ్చు. ఎవరు ఆమెతో మాట్లాడినా వాళ్లకు ఎదో బ్యాడ్ జరుగుతుందన్నట్టు పాటలో చూపించారు. 'అదిగో అదిగో బ్యాడ్ లక్ సఖి' అంటూ దేవిశ్రీ ప్రసాద్ చక్కటి సంగీతం అందించారు.

కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన ఈ మహిళా ప్రాధాన్య సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో 'దిల్‌' రాజు  సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రావ్యా వర్మ సహ నిర్మాత. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ షూటర్ పాత్రలో కనిపించనున్నారు. ఓ పల్లెటూరి అమ్మాయి నేషనల్ లెవల్ షూటర్ ఎలా అయ్యిందనేది కథ. కీర్తీ సురేష్ కోచ్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. జాతీయ పురస్కార గ్రహీత కీర్తీ సురేష్, విమర్శకుల ప్రశంసలతో పాటు పలు పురస్కారాలు అందుకున్న నగేష్ కుకునూర్ ఫస్ట్ టైమ్ చేసిన సినిమా ఇది.

Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!
Also read: ‘సూర్యవంశీ’ స్క్రీనింగ్ ను అడ్డుకున్న రైతులు... కేంద్రం మీద ఉన్న కోపం అక్షయ్‌పై చూపించారుగా
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Nov 2021 11:55 AM (IST) Tags: keerthi suresh Devi Sri Prasad Good Luck Sakhi Bad Luck Sakhi Full Video Song Good Luck Sakhi Songs Good Luck Sakhi Video Songs

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ - చివరి టీ20లో భారత్ భారీ స్కోరు 

IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ - చివరి టీ20లో భారత్ భారీ స్కోరు 

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Union Budget 2023: ఇది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్

Union Budget 2023: ఇది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం