Jarann OTT : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'జారన్' - చేతబడి కథ... ఎట్టకేలకు తెలుగులోనూ స్ట్రీమింగ్
Jarann OTT Platform : రీసెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'జారన్' తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే హిందీ వెర్షన్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

Horror Thriller Jarann Movie Telugu Version OTT Streaming On Zee 5 : హారర్ థ్రిల్లర్ మూవీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ భాషలోనైనా అలాంటి కంటెంట్‌నే ఎక్కువగా మూవీ లవర్స్ ఇష్టపడుతుంటారు. తెలుగులో అయితే ఆ క్రేజ్ మరీ ఎక్కువ. తాజగా మరో మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'జారన్' తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నిజానికి ఆగస్ట్ 8నే 'జారన్' మూవీ అందుబాటులోకి వచ్చినా తెలుగు వెర్షన్ మాత్రమే తాజాగా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ 'Zee5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'మీరు ఈ హారర్ నుంచి తప్పించుకోలేరు. అది మీకు ఎప్పుడూ ఓ మార్గాన్ని కనుగొంటుంది.' అంటూ రాసుకొచ్చింది. ఓ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఈ మూవీలో అమృతా సుభాష్, అనితా డేట్ కేల్కర్, కిషోర్ కదమ్, జ్యోతి మల్షే, అవనీ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించగా... హృషికేష్ గుప్తా దర్శకత్వం వహించారు.
View this post on Instagram
Also Read : విజయ్ రష్మికల పెళ్లి డేట్ ఫిక్స్! - వెన్యూ సెర్చింగ్ మొదలు పెట్టేసిన నేషనల్ క్రష్?
స్టోరీ ఏంటంటే?
గ్రామాల్లో చేతబడి, బాణామతి, మూఢ నమ్మకాల బ్యాక్ డ్రాప్‌తో ఈ మూవీ తెరకెక్కింది. 'జారన్' అంటే మరాఠీలో 'చేతబడి' అని అర్థం. చేతబడి ప్రభావంతో ఓ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే ఈ మూవీ స్టోరీ. ఇక కథ విషయానికొస్తే... ఓ విలేజ్‌లో రాధ (అమృతా ఘోష్) కుటుంబం ఉంటుంది. రాధకు వివాహం జరిగిన తర్వాత తన భర్తతో కలిసి సిటీలో ఉంటుంది. వారికి కూతురు సైయీ పుడుతుంది. చిన్నప్పటి నుంచి తాను ఉంటున్న ఇంటిని అమ్మాలని రాధ తల్లిదండ్రులు చూస్తారు.
ఈ క్రమంలోనే రాధ ఆ ఇంటిని చూడాలని తన కూతురితో కలిసి వెళ్తుంది. అయితే, ఆ ఇంట్లోని ఓ గదికి ఎప్పుడూ తలుపులు వేసే ఉంటాయి. రాధకి పదేళ్ల వయసున్న టైంలో ఆ గదిలో గంగూతి (అనితా కేల్కర్) ఉండేది. ఆమె చేతబడి చేస్తుందని అంతా భయపడేవారు. చుట్టుపక్కల వారు ఆమెను ఇంటి నుంచి తరిమేయగా క్షుద్రపూజలు చేసిన బొమ్మ అలానే ఉండిపోతుంది. గంగూతి వెళ్లినప్పటి నుంచి రాధ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ ఇంట్లో మనశ్సాంతి అనేది ఉండదు. అయితే, ఆ బొమ్మను తన కూతురి కోసం రాధ మళ్లీ బయటకు తెస్తుంది. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అసలు రాధకు ఎవరు ఎందుకు చేతబడి చేశారు? చివరకు ఈ ప్రమాదం నుంచి ఆమె బయటపడిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















