అన్వేషించండి

Walteir Veerayya: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్ - పవర్‌ఫుల్ ట్యూన్ ఇచ్చిన DSP!

వాల్తేరు వీరయ్య సినిమాలో మూడో పాట ఆన్‌లైన్‌లో విడుదల అయింది.

వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ ట్యూన్ ఇచ్చారు. ఏదో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఈ పాట రానుందని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఈ పాటను ఇంకా యూట్యూబ్‌లో విడుదల చేయలేదు. మ్యూజిక్ ప్లాట్‌ఫాంల్లో ఈ పాటను ఎంజాయ్ చేయవచ్చు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్థి ఆలపించారు.

ఇప్పటికే ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’,‘బాస్ పార్టీ’ పాటలు విడుదలై చార్ట్ బస్టర్స్ అయ్యాయి. బాస్ పార్టీ పాటపై మొదట కొంత నెగిటివిటీ వచ్చినా, ఇప్పుడు రిపీట్స్‌లో కూడా వింటున్నారు. ఈ పాటను జస్ప్రీత్ జాజ్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. బాస్ పార్టీ తరహలోనే దీనికి కూడా లిరిక్స్‌ను దేవిశ్రీ ప్రసాద్‌నే అందించారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిరంజీవి సరసన శ్రుతి హాసన్, రవితేజ సరసన కేథరిన్ ట్రెసా జంటగా నటించారు.

‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ పాటను సౌత్ ఆఫ్ ఫ్రాన్స్ లో స్విజర్లాండ్-ఇటలీ బోర్డర్ లో ఉన్న ఆల్ప్స్ మౌంటెన్ లోయలో చిత్రీకరించారని చిరంజీవి చెప్పారు. అక్కడి లోయలో లొకేషన్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయని, ఆ లోయ అందాలు చూసి తాను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానని అన్నారు.

ఆ ఆనందాన్ని ఆపుకోలేక తానే స్వయంగా అక్కడి లొకేషన్స్ లో కొన్ని వీడియోలను షూట్ చేసి షేర్ చేస్తున్నానని చిరంజీవి తెలిపారు. లొకేషన్స్ చూడటానికి చాలా అందంగా ఉన్నా అక్కడ అంతకుమించిన చలి ఉందని అన్నారు. సాంగ్‌ను షూట్ చేసే సమయంలో మైనస్ 8 డిగ్రీల చలిలో కష్టపడి డాన్స్ చేశామని చెప్పారు.

షూటింగ్ లో స్టెప్స్ వేయడానికి కూడా చాలా కష్టమైందని అయినా సరే ఫ్యాన్స్ ఆనందం కోసం గడ్డకట్టే చలిని కూడా తట్టుకొని డాన్స్ చేశానని అన్నారు మెగాస్టార్. ఈ పాట కోసం టీమ్ లో ఉన్న ప్రతీ ఒక్కరూ చాలా కష్టపడ్డారని, తమ కష్టానికి తగ్గట్టుగానే పాట చాలా బాగా వచ్చిందన్నారు. సినిమాలో ఈ పాట ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని కచ్చితంగా తెలిపారు. మైత్రీ  మూవీ మేకర్స్ నిర్మాణంలో  తెరకెక్కిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget