Waltair Veerayya vs Veera Simha Reddy: : వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి - ఒకే కథను అటు ఇటు చేశారా?
Similarities between Waltair Veerayya vs Veera Simha : చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకే కథతో సినిమాలు వచ్చాయని... బ్యాక్‌డ్రాప్, జానర్ చేంజ్ చేశారని విమర్శలున్నాయి
ఒక్కటేనా? 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' కథలు ఇంచు మించు ఒక్కటేనా? ఓ కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి మైత్రీ మూవీ మేకర్స్ రెండు సినిమాలు నిర్మించిందా? లేదంటే దర్శకులు ఇద్దరూ ఒకే రూములో కూర్చుని కథలు రాశారా? ఈ అనుమానాలు రావడానికి కారణం ఏమిటంటే... రెండు సినిమాల మధ్య కొన్ని కామన్ పాయింట్స్ మనకు కనపడతాయి.
సంక్రాంతి బరిలో సినిమాలు విడుదల కాక ముందు వరకు... రెండిటిలో శ్రుతీ హాసన్ కథానాయిక కావడం, రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం వంటి కామన్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. విడుదలైన తర్వాత కథ విషయంలో కంపేరిజన్స్ వచ్చాయి. కామన్ పాయింట్స్ బయటకు వచ్చాయి.
వీరయ్యలో రవితేజ...
వీర సింహలో వరలక్ష్మి!
'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో మెగాస్టార్ చిరంజీవి హీరో. అయితే... మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేశారు. 'వీర సింహా రెడ్డి'లో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరో. వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ రోల్ చేశారు.
చిరంజీవికి రవితేజ సవతి సోదరుడు అయితే... బాలకృష్ణకు వరలక్ష్మి సవతి సోదరి అవుతారు. రెండు సినిమాల మధ్య ఫస్ట్ కామన్ రిలేషన్ ఇది. రిలేషన్ మాత్రమే కాదు... క్యారెక్టర్లు ఎండ్ అయిన తీరు, క్యారెక్టర్స్ మధ్య సన్నివేశాల్లో కూడా కంపేరిజన్స్ ఉన్నాయి.
ఎంత ద్వేషించినా ప్రేమించే హీరోలు!
సవతి సోదరి కావడంతో తనకు అన్యాయం చేశాడని బాలకృష్ణ పాత్ర మీద వరలక్ష్మి పాత్ర కోపం పెంచుకుంటుంది. పగతో రగిలిపోతుంది. అయినా సరే చెల్లెల్ని హీరో ప్రేమిస్తాడు. 'వీర సింహా రెడ్డి'లో పరిస్థితి అది. 'వాల్తేరు వీరయ్య'కు వస్తే... మొదటి భార్య కొడుకు మీద ప్రేమ చూపిస్తున్నాడని భర్త మీద రెండో భార్య అలుగుతుంది. కొడుకును తీసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ పోలీస్ అధికారిగా సొంతూరు వచ్చిన రవితేజకు, సవతి సోదరుడైన చిరంజీవికి అసలు పడదని అన్నట్లు ఇద్దరి మధ్య సన్నివేశాలు సాగుతాయి. చివరకు, ట్విస్ట్ ఉందనుకోండి.
రెండు సినిమాల్లో కథను లీడ్ చేసిన కాన్సెప్ట్ మాత్రం సవతి సోదరులు, సవతి సోదరీ సోదరుల మధ్య సంబంధాలే. మరో కామన్ థింగ్ ఏంటంటే... 'వీర సింహా రెడ్డి'లో వరలక్ష్మి క్యారెక్టర్ చనిపోతే, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ క్యారెక్టర్ చనిపోతుంది.
క్లైమాక్స్ ఒక్కటేనా...
విలన్లను ఒకేలా చంపారు!
'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి'... సినిమాల్లోనూ క్లైమాక్స్ సీన్స్ ఇంచు మించు ఒకేలా ఉంటాయి. అంటే... నేపథ్యం వేరు కావచ్చు. కానీ, విలన్లను హీరోలు చంపిన విధానం ఒక్కటే. బహుశా... రెండు సినిమాలకు ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ వర్క్ చేయడం వల్ల ఒకేలా డిజైన్ చేశారా? లేదంటే దర్శకులు అలా కావాలని అడిగారా? మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు తెలియాలి. రెండు సినిమాల్లో ఇంటర్వెల్ ముందు మెయిన్ ట్విస్ట్ రివీల్ కావడంతో పాటు మర్డర్స్ చోటు చేసుకుంటాయి.
హీరోయిన్‌తో హీరో ప్రేమ!
రెండు సినిమాల్లోనూ శ్రుతీ హాసన్ క్యారెక్టర్లు వేర్వేరు. కానీ, విదేశాల్లో ఆమె పాత్రను దర్శకులు పరిచయం చేశారు. ప్రేమలో పడినట్లు చూపించారు. రెండు సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య రెండేసి పాటలు ఉన్నాయి. అయితే... ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాటలు రెండు సినిమాల్లో కథకు అడ్డు తగిలాయని విమర్శలు ఉన్నాయి.
Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?
'వీర సింహా రెడ్డి' ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే... 'వాల్తేరు వీరయ్య' కామెడీతో కూడిన ఫ్యామిలీ డ్రామా. రెండు సినిమాల్లో యాక్షన్ ఉంది. హీరోయిజం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అయితే... కంప్లీట్ డిఫరెంట్ ట్రీట్మెంట్, తమదైన శైలిలో దర్శకులు సినిమాలు తెరకెక్కించారు.
Also Read : పవన్ కొలతలు కావాలి, బాలకృష్ణ మాట విన్నారా? - 'అన్‌స్టాపబుల్ 2' వీడియో గ్లింప్స్ వచ్చేసిందండోయ్