By: ABP Desam | Updated at : 14 Sep 2022 02:41 PM (IST)
శృతి హాసన్, చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా రెండు మూడు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో 'గాడ్ ఫాదర్' ఒకటి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రత్యేక పాత్రలో నటించిన ఆ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చేస్తున్నారు. కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా మంచి మాస్ మూవీగా రూపొందుతోంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండక్కి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంక్రాంతికి మెగాస్టార్ 154 సినిమా!
బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిరంజీవికి 154వ సినిమా. అందుకని, Mega 154 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్నారు. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన బాబీ... 'పూనకాలు లోడింగ్' అంటూ సినిమాపై మెగా అభిమానులు, ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్నారు. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి.
బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రావడం లేదట!
నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ఆ మధ్య అనుకున్నారు. అప్పుడు చిరంజీవి సినిమా వాయిదా పడొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపించింది. అయితే... రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. రెండూ పోటీ పడితే సంస్థకు నష్టం. అందువల్ల, ఒక సినిమాను సంక్రాంతికి మరొక సినిమాను మరో తేదీకి విడుదల చేసేలా హీరోలను ఒప్పించారని తెలుస్తోంది. సంక్రాంతికి చిరంజీవి సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.
చిరంజీవి సినిమాలో రవితేజ కూడా...
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో చివరి షెడ్యూల్ చేశారు. ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే మళ్ళీ చేయవచ్చు. Mega 154కు 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) టైటిల్ ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read : బాయ్‌కాట్ ట్రెండ్‌ను తీసి పారేసిన నాగార్జున - వందో సినిమా గురించి ఏం చెప్పారంటే?
Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్‌గా మాత్రం కాదు
Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!
Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్!
Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>