Mechanic Rocky Trailer: యాక్షన్, రొమాన్స్, బూతులు - ఫుల్ మాస్‌గా విష్వక్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్!
Vishwak Sen Mechanic Rocky: ప్రముఖ హీరో విష్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది.
Mechanic Rocky Trailer Launched: మాస్ కా దాస్ విష్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్నారు. రవితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సరిపోదా శనివారం’ సినిమాకు బ్లాక్‌బస్టర్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పుడు విడుదల చేశారు. దీనికి ట్రైలర్ 1.0 అని పేరు పెట్టారు. దీన్ని బట్టి సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Taking the masssss in you for a ride with #MechanicRocky 🛠🔥
— Ram Talluri (@itsRamTalluri) October 20, 2024
Trailer 1.0 Out Now! 💥https://t.co/0RHveX9JPJ#MechanicRockyOnNOV22 🛠
Mass Ka Das' @vishwaksens @ramtalluri @ravitejadirects @meenakshichaudhary006 @shraddhasrinath @jakes_bejoy @rajani_talluri @suniltollywood… pic.twitter.com/mt1PUpmaxq
‘మెకానిక్ రాకీ’ మూడో సినిమా
ఈ సంవత్సరం విష్వక్ సేన్ నటించిన మూడో సినిమా ఇది. 2024 మార్చిలో ‘గామి’, మేలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో ‘గామి’కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. దీంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. మరి 2024 సంవత్సరాన్ని విష్వక్ సేన్ విజయంతో ముగిస్తాడో లేదో చూడాలి.
మరో మూడు సినిమాలు లైన్‌లో...
విష్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం మరో మూడు సినిమాలు ఉన్నాయి. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమాలో విష్వక్ సేన్ నటిస్తున్నారు. ఇందులో విష్వక్ లేడీ గెటప్‌లో కనిపించనుండటం విశేషం. కొత్త దర్శకుడు శ్రీధర్ గంటా దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమా చేస్తున్నారు. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మూడు సీక్వెల్స్ కూడా...
అలాగే విష్వక్ చేసిన మూడు సినిమాలకు సీక్వెల్స్ కూడా వస్తాయని వార్తలు వస్తున్నాయి. 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ హిట్ స్టేటస్‌ను పొందింది. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. విష్వక్ సేన్ కూడా దీనికి సీక్వెల్ చేయాలని ఉందని, కానీ అది తరుణ్ భాస్కర్ చేతిలో ఉందని అన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. 2019లో విష్వక్ తనే డైరెక్టర్‌గా మారి ‘ఫలక్‌నుమా దాస్’ అనే సినిమా తీశారు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని విష్వక్ సేన్ అన్నారు. 2023లో ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాను విష్వక్ సేన్ తనే హీరోగా నటించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు పోస్ట్ క్రెడిట్ సీన్ పెట్టి మరీ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఈ మూడిట్లో ఏ సీక్వెల్ ముందు వస్తుందో చూడాలి.