Vijay Varma Tamannaah: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ
గత కొంత కాలంగా విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, మిల్కీ బ్యూటీతో డేటింగ్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
Tamannaah Bhatia- Vijay Varma Dating: దక్షిణాది సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. స్టార్ హీరోల సరసన పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. గత కొంతకాలంగా అమ్మడు ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు విజయ్ వర్మతో లవ్ లో మునిగి తేలుతోంది. బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు.
మా డేటింగ్ ఎప్పుడు మొదలైందంటే?- విజయ్
విజయ్ వర్మ ‘మర్డర్ ముబారక్’ అనే చిత్రంలో నటించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించింది. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ఏసిపి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న విజయ్ వర్మ... తమన్నాతో డేటింగ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. మిల్కీ బ్యూటీతో ఎలా ప్రేమలో పడ్డారు? ప్రేమ ఎక్కడ మొదలైంది? ఫస్ట్ డేట్ ఎలా ఉంది? అనే విషయాలను వివరించారు. ‘‘లస్ట్ స్టోరీ 2’ మేం చేసినప్పటికీ, షూటింగ్ సమయంలో డేటింగ్ మొదలు కాలేదు. ‘లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ తర్వాత ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీకి కేవలం నలుగురు మాత్రమే వచ్చారు. ఆ రోజు తమన్నాతో ఎక్కువ సమయం గడపాలి అనిపిస్తుందని చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ కి 20 నుంచి 25 రోజులు పట్టింది” అని చెప్పారు.
‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ సీన్లతో ఆకట్టుకున్న విజయ్, తమన్నా
ఇక ‘లస్ట్ స్టోరీస్ 2’లో తమన్నా, విజయ్ వర్మ కలిసి బోల్డ్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. విజయ్ తో బోల్డ్ సీన్లలో నటిస్తున్నప్పుడు చాలా సేఫ్ గా ఫీలైనట్లు చెప్పింది తమన్నా. గతంలో ఏ హీరోతో తాను ఇంత కంఫర్ట్ గా ఫీల్ కాలేదని వెల్లడించింది. విజయ్ దగ్గర ఉంటే చాలా సేఫ్ గా అనిపిస్తుందని వివరించింది. అతడు ఉన్నంత సేపు చాలా సంతోషం కలుగుతుందని వెల్లడించింది. అటు తమన్నాతో డేటింగ్ గురించి విజయ్ వర్మ కీలక విషయాలు వెల్లడించారు. తాను ఆమెతో ఉన్నంత సేపు చాలా హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలిపారు.
వరుస సినిమాలతో విజయ్, తమన్నా బిజీ
విజయ్ వర్మ తాజాగా ‘మర్డర్ ముబారక్’ సినిమాలో కనిపించారు. నాగరాజ్ మంజులేతో కలిసి ‘మట్కా కింగ్’ చేస్తున్నారు. పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ సీజన్ 3లోనూ కనిపించనున్నారు. అటు తమన్నా ‘ఓదెల 2’ సినిమాలో నటిస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు గ్లామరస్, స్టైలిష్ పాత్రలు పోషించిన తమన్నా, ఈసారి శివశక్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో తమన్నా శివుడి భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబతోంది.
Read Also: అక్కడ రాజు, ఇక్కడ బానిస- ‘ది గోట్ లైఫ్’ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్