By: ABP Desam | Updated at : 12 Jan 2023 11:48 PM (IST)
Image Credit: Khushbu/Twitter
తమిళ హీరో విజయ్ నటించిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’. ఇప్పటికే ఈ మూవీ తమిళనాడులో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో మాత్రం మూడు రోజులు ఆలస్యంగా సంక్రాంతి రోజున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా రష్మిక మందన్నా నటించిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగు నటులు జయసుధా, శ్రీకాంత్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అయితే, ఈ మూవీ ప్రారంభానికి ముందు ఖుష్పూ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆ మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఫొటోల్లో కూడా ఖుష్బూ ఉన్నారు. ఈ విషయాన్ని ఖుష్బూ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జనవరి 11న (బుధవారం) ఈ మూవీ చూసిన తమిళ ప్రేక్షకులు.. ఖుష్బూ పాత్ర కోసం ఎదురుచూశారట. ఆమెను ట్రైలర్‌లో కూడా చూపించకపోవడంతో ఏదో కీలక పాత్రలో లేదా అతిథి పాత్రలో కనిపిస్తుందేమో అని అనుకున్నారు. అయితే, మూవీకి శుభం కార్డు పడేవరకు ప్రేక్షకులకు అర్థం కాలేదట. అసలు ఖుష్బూను ఏ పాత్ర కోసం ఎంపిక చేశారు? ఎందుకు తొలగించారనే సందేహం నెలకొందట. వాస్తవానికి తమిళ ప్రేక్షకులకు ఖుష్ఫూ అంటే వీరాభిమానం. ఆమె ఆ సినిమాలో ఉంటుందని తెలియడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే, ఆఖరి క్షణంలో ఖుష్బూ పాత్రను సినిమా నుంచి తొలగించడమో లేదో ఆమె నటించాల్సిన పాత్రను వేరొకరిని ఎంపిక చేయడమో జరిగి ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఖుష్బూను విజయ్‌కు తల్లి పాత్ర కోసమే ఎంపిక చేసి ఉంటారని, ఆఖరి క్షణంలో ఆమెను తొలగించి జయసుధను ఎంపిక చేసి ఉండొచ్చని సమాచారం. అయితే, దీనిపై ‘వారసుడు’ టీమ్ ఇంకా స్పందించాల్సి ఉంది.
‘వారసుడు’లో తన పాత్రపై.. ఖుష్బూ మూవీ ప్రారంభానికి ముందే చెప్పారు. అప్పట్లో ఆమె పోస్టు చేసిన ట్వీట్లోనే స్పష్టత ఇచ్చారు. ‘‘ఈ కుటుంబంలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ‘వారసుడు’ మూవీ గురించి చెప్పారు. అయితే, దీని గురించి తాను ఇంకా ఏమైనా చెప్పాలంటే.. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది అని కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ పాత్ర కేవలం ఆప్షన్ మాత్రమేనని, చివరి క్షణంలో ఆమె పాత్రను తొలగించి ఉండవచ్చని తెలుస్తోంది.
‘వారసుడు’ మూవీని ఏకకాలంలో తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో భారీగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘వీరసిహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ మూవీలు కూడా బోగి, సంక్రాంతి రోజుల్లో ఏర్పడటంతో సినిమా హాళ్ల కొరత కూడా ఏర్పడింది. దిల్ రాజుపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. మొత్తానికి దిల్ రాజు వెనక్కి తగ్గక తప్పలేదు. 11వ తేదీకి బదులు ఈ నెల 14న ‘వారసుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ మూవీ హీరో విజయ్ కేవలం తమిళనాడులో జరిగిన ప్రమోషన్స్‌లో మాత్రమే పాల్గొన్నాడు. మూవీ జనవరి 11న విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించేందుకు సమయం సరిపోలేదు. దీనిపై ‘దిల్’ రాజు స్పందిస్తూ.. ఈ సినిమా 11న విడుదల చేయాలనుకున్నాం.. కాబట్టి విజయ్‌ను హైదరాబాద్‌కు తీసుకురాలేకపోయానని తెలిపారు. ఇప్పుడు 14కు విడుదల చేస్తున్నాం కాబట్టి తప్పకుండా విజయ్‌ను తీసుకొచ్చి ప్రొమోట్ చేయిస్తానని అన్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు బరిలో ఉన్నాయి కాబట్టి.. అందరు నిర్మాతలు బాగుండాలన్న ఉద్దేశంతో తానే ఓ అడుగు వెనక్కివేసి తన సినిమాను 14కి పోస్ట్ పోన్ చేసుకున్నానని తెలిపారు.
Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?
Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి