Trolls On Thalapathy 67 : నాగార్జున 'ఘోస్ట్' టీజర్‌లా ఉందేంటి? దళపతి విజయ్ 'లియో'పై ట్రోల్స్
Netizens Targets Vijay's Leo : 'విక్రమ్' విజయం తర్వాత విజయ్ హీరోగా లోకేష్ కానగరాజ్ సినిమా తీస్తున్నారు. 'లియో' టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. దానిపై ట్రోల్స్ వస్తున్నాయి.
లియో (Leo Vijay Movie)... దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా. లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న సినిమా. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. లేటెస్టుగా కశ్మీర్ షెడ్యూల్ కేసుల స్టార్ట్ అయ్యింది. 'లియో' టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ మీద ట్రోల్స్ వస్తున్నాయి.
'లియో'... ప్రత్యేకతలు ఎన్నో!
'లియో'కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 'మాస్టర్' తర్వాత మరోసారి విజయ్, లోకేష్ చేస్తున్న చిత్రమిది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (Lokesh Cinematic Universe)లో రూపొందుతోన్న సినిమా. విజయ్, త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత నటిస్తున్న సినిమా. 'విక్రమ్'లో ఏజెంట్ టీనా రోల్ చేసిన వాసంతి ఇందులో కూడా ఉన్నారు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో 'లియో'ను ఎలా కనెక్ట్ చేస్తారు? అనే దానిపై చాలా థియరీలు వినిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే... దీనిపై ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
నాగార్జున 'ఘోస్ట్' టీజర్‌లా ఉందేంటి?
'లియో' టైటిల్ అనౌన్స్ టీజర్ మీద వస్తున్న కాంప్లిమెంట్స్ పక్కన పెట్టి ట్రోల్స్ చూస్తే... కొంత మంది తెలుగు ప్రేక్షకులకు ఆ టీజర్ చూసిన తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'ఘోస్ట్' టీజర్ గుర్తుకు వచ్చింది.
Also Read : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
#LEO vs #THEGHOST#Vijay 🤜🤛 #Nagarjuna#BloodySweet #Thalapathy67 pic.twitter.com/gUPnCMzPKW
— மதுரRED (@madurai_ak) February 3, 2023
'ఘోస్ట్' టీజర్ చూస్తే... అందులో హీరో కత్తి చేస్తూ ఉంటాడు. జపాన్‌లో అరుదైన స్టీల్ 'తమహగనే' ఉపయోగించి ఖడ్గాలు తయారు చేస్తారు. 'ఘోస్ట్'లో విలన్లను నాగార్జున ఊచకోత కోసిన ఖడ్గాన్ని ఆ స్టీల్‌తో తయారు చేసినట్టు ప్రవీణ్ సత్తారు వీడియో విడుదల చేయగా... సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కంటే టీజర్ సూపర్ హిట్టు అయ్యిందని చెప్పవచ్చు. ఇప్పుడు 'లియో'లో విజయ్ ఖడ్గాన్ని తయారు చేసినట్టు చూపిస్తే... తెలుగు ప్రేక్షకులకు ఆ టీజర్ గుర్తుకు వచ్చింది. కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అదీ సంగతి!
త్రిషను చంపేస్తే శవాలు లేస్తాయ్
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. సినిమా మధ్యలో హీరోయిన్లు హత్యకు గురైనట్లు చూపిస్తారు. అందువల్ల, 'లియో'లో త్రిష పాత్రను మధ్యలో చంపేస్తే ఊరుకునేది లేదని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో అల్టిమేటం జారీ చేస్తున్నారు. అంతే కాదు... త్రిషను చంపేస్తే శవాలు లేస్తాయ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అదీ సంగతి!
Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా?
Trisha ni champeste sevaal lestaay tammudu @Dir_Lokesh
— . (@saigaaadu) February 1, 2023
తెలుగు హీరోలపై సెటైర్లు!
విజయ్ 'వారసుడు' సినిమా సంక్రాంతికి విడుదల అయ్యింది. దాని కంటే ముందు 'లియో' షూటింగ్ మొదలైంది. కానీ, 'వారసుడు' పబ్లిసిటీకి అడ్డు వస్తుందని న్యూస్ బయటకు రానివ్వలేదు. నటుడు మనోబాల సినిమా గురించి జనవరి 4న ఒక ట్వీట్ వేసి కొంత సేపటి తర్వాత డిలీట్ చేశారు కూడా! 'వారసుడు' విడుదలైన తర్వాత వరుసపెట్టి అప్ డేట్స్ ఇస్తున్నారు. తమిళ స్టార్ హీరోలు ఏడాదికి రెండేసి సినిమాలు చేస్తుంటే... తెలుగు హీరోలు కొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటున్నారని కొందరు అభిమానులు వాపోతున్నారు.