Hyderabad Black Hawks team: స్పోర్ట్స్ రంగంలోకి రౌడీ హీరో, వాలీబాల్ టీం కో ఓనర్గా విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. సినిమాలతో బిజీగా ఉన్నా, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ టీమ్ కో ఓనర్ గా మారిపోయారు.
ఎప్పుడు సినిమాలతో బిజీ బిజీగా గడిపే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, స్పోర్ట్స్ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. సినిమా హీరో కాస్త స్పోర్ట్స్ పర్సన్ గా అవతారం ఎత్తాడు. మెన్స్ వాలీబాల్ టీమ్ కు ఓ ఓనర్ గా మారిపోయాడు.ఇకపై హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీంను విజయ్ ప్రమోట్ చేయనున్నారు.ప్రైమ్ వాలీబాల్ లీగ్ లో పోటీ పడుతున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీంకు తాజాగా విజయ్ దేవరకొండ కో ఓనర్ గా మారాడు. ఆ టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ ఆయన వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఓనర్ అభిషేక్ రెడ్డి కంకణాల స్వయంగా వెల్లడించారు.
THE #VijayDeverakoda turns sports entrepreneur. He is now the co-owner of professional Volleyball team, Hyderabad Black Hawks. #HyderabadBlackHawks @TheDeverakonda @blackhawkshyd pic.twitter.com/EvRuPaOgRP
— BA Raju's Team (@baraju_SuperHit) January 23, 2023
వాలీబాల్ క్రీడను దేశంలో ప్రతి మూలకు తీసుకెళ్లడమే లక్ష్యం- విజయ్
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. తనను బ్లాక్ హాక్స్ టీమ్ కు కో ఓనర్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. “ప్రైమ్ వాలీబాల్ లీగ్ మ్యాచ్ కేవలం ఆరంభం మాత్రమే. వాలీబాల్ క్రీడను దేశంలో ప్రతి మూలకు తీసుకువెళ్లాలన్నది మా లక్ష్యం. ఏజ్, బ్యాక్ గ్రౌండ్, జెండర్ తేడా లేకుండా, అన్ని స్ధాయిల ప్రజలకు దీన్ని చేరువ చేయాలనుకుంటున్నాం. వాలీబాల్‌ను ఓ క్రీడగా మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగించే రీతిలో మార్చాలనుకుంటున్నాం” అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా విజయ్ దేరవకొండ బ్లాక్ కాస్ట్యూమ్స్ లో కనిపించాడు. టీం సభ్యులతో కలిసి సందడి చేశాడు. ట్రోపీ పట్టుకుని సందడి చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఫిబ్రవరి 4 నుంచి వాలీబాల్ లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభం
ఇండియన్ ప్రొఫెషనల్ వాలీబాల్ లీగ్ లో హైదరాబాద్, అహ్మాదాబాద్, కోల్‌కతా, కాలికట్, కొచి, చెన్నై, బెంగళూరు, ముంబైల నుంచి ఎనిమిది టీమ్‌లు పోటీపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఒక్కటే ప్రాతినిధ్యం వహిస్తోంది. వాలీబాల్ లీగ్ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 4న మొదలై మార్చి 5 వరకు జరుగుతాయి. ఈ లీగ్ ని సోనీ స్పోర్ట్స్ 1, 3, 4లలో ప్రసారం చేస్తారు.
రెండు సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ
ఇక విజయ్ సినిమాల గురించి చూస్తే, గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర0 బోల్తా కొట్టింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఊహించని రీతిలో డిజాస్టర్ గా మిగిలింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు. జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్ట్ (VD12) చేస్తున్నాడు.
The Script. The Team. My next.
— Vijay Deverakonda (@TheDeverakonda) January 13, 2023
My heart skipped a few beats when I heard this. #VD12 pic.twitter.com/x7ELlsb6Ub
Read Also: అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపిన ‘పఠాన్’, దక్షిణాదిలోనే అత్యధికం