Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

'ఖుషి' చిత్రబృందం కశ్మీర్‌లో షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్ లో వస్తోన్న 11వ సినిమా ఇది. మొన్నామధ్య సినిమా ఫస్ట్ లుక్ ని వదిలారు. దీనికి 'ఖుషి' అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ టీమ్ టైటిల్ ను మార్చే ఉద్దేశంలో లేదు. 

కశ్మీర్ నేపథ్యంలో అందమైన ప్రేమకథతో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. అక్కడే విజయ్ దేవరకొండ, సమంతలు తన పుట్టినరోజులను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చిత్రబృందం కశ్మీర్‌లో షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అక్కడ కొన్ని లవ్ సీన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. 

ఇప్పుడు టీమ్ హైదరాబాద్ కి పయనమైంది. కొన్ని రోజుల బ్రేక్ తరువాత హైదరాబాద్ లోనే నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  

మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.

Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Published at : 23 May 2022 10:38 AM (IST) Tags: samantha Siva Nirvana Vijay Deverakonda Kushi Movie Kashmir schedule Kushi Update

సంబంధిత కథనాలు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?