News
News
X

Vijay Devarakonda: ఆర్మీ బేస్‌లో విజయ్ దేవరకొండ గన్ షూటింగ్ - వీడియో వైరల్!

దీపావళి పండగ దగ్గరపడుతుండటంతో.. ఆర్మీ బేస్ లో తను గన్ షూటింగ్ చేసిన వీడియోను షేర్ చేశారు విజయ్.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' బాక్సాఫీస్ బరిలో ఘోరంగా చతికిలపడింది. వసూళ్ల సంగతి పక్కన పెడితే... విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. ఆ రిజల్ట్ విజయ్ దేవరకొండ మీద కొంతవరకు ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలపై మరింత ఫోకస్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. 

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం విజయ్ ఆర్మీ బేస్ కి వెళ్లారు. కశ్మీర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరి సెక్టార్ లోని ఆర్మీ బేస్ క్యాంప్ కి వెళ్లారు. అక్కడ జవాన్లతో కలిసి గడిపారు. వారి దగ్గర గన్ షూటింగ్ వంటివి నేర్చుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడేమో ఒక వీడియో షేర్ చేశారు. 

దీపావళి పండగ దగ్గరపడుతుండటంతో.. ఆర్మీ బేస్ లో తను గన్ షూటింగ్ చేసిన వీడియోను షేర్ చేశారు విజయ్. 'ఈ దివాళికి.. గన్స్, గన్స్, గన్స్. నైట్ పాట్రోల్స్, గేమ్స్, సాంగ్స్, డాన్స్, బోట్ రేసెస్, సర్వైవల్ డ్రిల్స్. గ్రేట్ మెమొరీస్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. పూరి జగన్నాధ్ తో చేయబోయే 'జనగణమన' సినిమా కోసమే విజయ్.. జవాన్లను కలిశారని.. గన్ షూటింగ్ నేర్చుకున్నారని టాక్. 'లైగర్' ప్లాప్ తరువాత విజయ్ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. కొంతమంది ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ప్రస్తుతం విజయ్ చేతిలో 'ఖుషి' అనే సినిమా ఉంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. నెక్స్ట్ మంత్ నుంచి 'ఖుషి' షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఆల్రెడీ కశ్మీర్ మంచు కొండల్లో ఒక షెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ హైదరాబాద్ సిటీలో స్టార్ట్ కానుందని టాక్. 

'జెర్సీ' డైరెక్టర్ తో విజయ్:

ఇటీవల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. విజయ్ దేవరకొండని కలిసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) మాంచి ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుగు చిత్రసీమ వర్గాల కథనం.
ఆల్రెడీ విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, దానికి హీరోతో పాటు నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగాయట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. 

అశ్వనీదత్ తో మరో సినిమా:
అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సౌత్ లో కూడా పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్ కి నచ్చింది. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు వెళ్లింది. ఆయనకు కూడా నచ్చడంతో.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!

Published at : 20 Oct 2022 03:20 PM (IST) Tags: Vijay Devarakonda Vijay Devarakonda gun firing Vijay Devarakonda army base

సంబంధిత కథనాలు

Prabhas Rumoured Girlfriends : ప్రభాస్ ప్రేమ గోల - హీరోయిన్లు ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయట?

Prabhas Rumoured Girlfriends : ప్రభాస్ ప్రేమ గోల - హీరోయిన్లు ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయట?

Ennenno Janmalabandham February 9th: అభిమన్యుని గుడ్డిగా నమ్ముతున్న మాళవిక- నిజం తెలుసుకుని బాధపడ్డ వేద

Ennenno Janmalabandham February 9th: అభిమన్యుని గుడ్డిగా నమ్ముతున్న మాళవిక- నిజం తెలుసుకుని బాధపడ్డ వేద

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Turkey Earthquake: టర్కీలో భూకంపానికి వణుకుతున్న శ్రీకాకుళం వాసులు - బిక్కుబిక్కుమంటూ అక్కడే!

Turkey Earthquake: టర్కీలో భూకంపానికి వణుకుతున్న శ్రీకాకుళం వాసులు - బిక్కుబిక్కుమంటూ అక్కడే!

Chocolate day: ప్రేమికులకు ఈరోజు చాకొలెట్ పండుగ - హ్యాపీ చాకొలెట్ డే

Chocolate day: ప్రేమికులకు ఈరోజు చాకొలెట్ పండుగ - హ్యాపీ చాకొలెట్ డే

IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?

IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?