News
News
X

Vijay Devarakonda: రౌడీ బాయ్ తడబడుతున్నాడా? ఎక్కడ తప్పు చేస్తున్నాడు?

విజయ్ దేవరకొండ సినిమా స్క్రిప్ట్స్ ను ఎన్నుకోవడంలో తడబడుతున్నాడా..?

FOLLOW US: 

విజయ్ దేవరకొండ..(Vijay Devarakonda) యంగ్ హీరోల్లో ఓ సెన్సేషన్. ఓ స్టార్మ్. యూత్ లో సూపర్ ఫాలోయింగ్. అన్నీ ఊరికే వచ్చేయలేదు. టాలెంట్ ఉంది. యాక్టింగ్ లో వేరియేషన్ చూపించగలడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం'.. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దేనికవే సెపరేట్ క్యారెక్టర్స్. ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు. 'గీత గోవిందం' తర్వాత ఏమీ చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా...? దాని తర్వాత ఆ రేంజ్ హిట్టు ఒక్కటీ లేదు కాబట్టి.  

'ట్యాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్' సబ్జెక్ట్స్ పరంగా చాలా మంచివే కానీ ఒకదానికి పైరసీ ప్రాబ్లం, ఇంకో దానికి మిక్స్డ్ టాక్ రావటంతో ఆశించిన విజయాలు సాధించలేదు. సో ఆ లెక్కన చూసుకుంటే 2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమానే లాస్ట్ హిట్. 'నోటా', 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ అయ్యాయి. ఇక 'లైగర్'(Liger) కోసం... సినిమా పరిభాషలో చెప్పాలంటే బ్లడ్, స్వెట్ పెట్టి పనిచేశాడు. క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ రకంగా విజయ్ కు ఫుల్ మార్క్స్ ఇవ్వొచ్చు. కానీ సినిమా తేడా కొట్టేసింది. 

యూత్ లో విజయ్ యాటిట్యూడ్ కు చాలా క్రేజ్ ఉంది. కానీ ఈ మధ్య అది కూడా తనకు నెగెటివ్ గా మారుతున్నట్టు అనిపిస్తోంది. మరీ ఓవర్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమా హిట్ అయి ఉంటే ఇవన్నీ పక్కకు వెళ్లిపోయేవి. కానీ అది జరగలేదు. ఇప్పుడు విజయ్ ఆలోచించాల్సిన విషయం నెక్స్ట్ ఏంటి... అని. 

టాలెంట్ పరంగా ఏమాత్రం తక్కువ లేని యాక్టర్ కు నాలుగేళ్లుగా సరైన హిట్ లేకపోవడం ఏంటి..? సినిమాల జడ్జ్ మెంట్ లో విజయ్ ఏమైనా తప్పు చేస్తున్నాడా..? లేకపోతే కథ చెప్పినప్పుడు తనకు సూపర్ గా అనిపించిన సబ్జెక్టే సరిగ్గా ఔట్ పుట్ రావట్లేదా..? విజయ్ కెరీర్ స్టార్టింగ్ లో అందుకున్న హిట్లన్నీ వేటికవే స్పెషల్. కచ్చితంగా కాదనలేం. అర్జున్ రెడ్డి అయితే... రిలీజ్ అయి సరిగ్గా ఇవాళ్టికి ఐదేళ్లు. అదొక పాత్ బ్రేకింగ్ మూవీ. 

ఆ సినిమా, దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ లో వచ్చిన గీత గోవిందమే విజయ్ ను క్రేజీ స్టార్ గా మార్చేశాయి. కానీ ఇక ఆ సినిమాల హిట్ ఇమేజ్... ఇంకెన్నాళ్లు విజయ్ ను బ్యాక్ చేస్తుంది..? ఇప్పుడు విజయ్ నుంచి రాబోయే రెండు సినిమాలు జనగణమన, ఖుషి. లైగర్ రిలీజ్ కాకముందే జనగణమన అనౌన్స్ చేశారు. రిలేటెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. మరి పూరి దాన్ని మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తారా... విజయ్ మరింత స్పెషల్ కేర్ తీసుకుంటాడా..? ఖుషి ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ డైరెక్టర్. విజయ్ కెరీర్ ఇప్పుడున్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలంటే ఈ రెండు సినిమాలు కచ్చితంగా హిట్ అవాల్సిన అవసరముంది. లేకపోతే ఇప్పటికే కాస్త డౌన్ వర్డ్ గా వస్తున్న కెరీర్ గ్రాఫ్ మరింత వేగంగా పడిపోయే ప్రమాదముంది.

Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

Published at : 25 Aug 2022 04:51 PM (IST) Tags: Vijay Devarakonda Liger Movie Vijay Devarakonda script selection Vijay Devarakonda flop streak

సంబంధిత కథనాలు

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: నేహా ఎలిమినేట్ అయ్యాక ఆదిరెడ్డి - రాజశేఖర్ ఏమన్నారంటే, నాగార్జున చెప్పినా రివ్యూలు మానని ఆదిరెడ్డి

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి