Venu Swamy: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు
కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ఉండే అవకాశాలు లేవని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళిద్దరి జాతకాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కథానాయిక లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు. ఆ మాటకు వస్తే వాళ్ళిద్దరూ ఏడు అడుగులు వేసి రెండు నెలలు కూడా నిండలేదు. నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హనీమూన్ టూర్ (Varun Tej Lavanya Tripathi Honeymoon)లో ఉన్నారు.
కొత్త జంట చూడముచ్చటగా ఉందని, నిండు నూరేళ్ళు చల్లగా పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. దీవెనలు అందిస్తున్నారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఏమో వాళ్ళు కలిసి ఉండే అవకాశాలు లేవని చెబుతున్నారు.
వరుణ్, లావణ్య జాతకాలు కలవలేదు!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త వేణు స్వామి (Astrologer Venu Swamy) తాజాగా ఓ డిజిటల్ (యూట్యూబ్) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
''వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసుండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ (Varun Tej)కు నాగ దోషం ఉంది. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉంది'' అని వేణు స్వామి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రేక్షకులు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేణు స్వామి ఇంటర్వ్యూలో రెండు విధాలుగా మాట్లాడారు. మొదట లావణ్యకు కుజ దోషం ఉందని చెప్పిన ఆయన... ఆ తర్వాత లావణ్య జాతకంలో కుజ దోషంతో పాటు నాగ దోషం కూడా ఉందన్నారు. వరుణ్ తేజ్ జాతకంలో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నాడని చెప్పారు. అందువల్ల, ఆయన మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు చెబుతున్నారు.
Also Read: తప్పేముంది? మీకేం అన్యాయం చేశాను? సురేఖావాణి కూతురు సుప్రిత ఆవేదన
అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయని... ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ ముమ్మాటికీ తన మాటలు నిజం అవుతాయని వేణు స్వామి చెబుతున్నారు. తన సక్సెస్ రేషియో 98 శాతం అనేది చెబుతున్న మాట. ఆయన మాటలు నిజం కాకూడదని, నిజం అయ్యే అవకాశాలు లేవని ప్రజలు అంటున్నారు.
Also Read: ఫోన్ స్విచాఫ్ చేసుకొని వెళ్లిపోయారు - సంతోషం అవార్డ్స్‌లో ఏం జరిగిందో బయటపెట్టిన టీఎఫ్‌సీసీ
తెలంగాణ రాష్ట్రంలో 2023లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని లేదంటే తాను జాతకాలు చెప్పడం మానేస్తానని వేణు స్వామి గతంలో చెప్పారు. ఈ కొత్త ఇంటర్వ్యూలో తాను కెసిఆర్ ముఖ్యమంత్రి కారని చెప్పినట్లు, తన మాటలు నూటికి నూరు శాతం నిజం అయినట్లు చెప్పుకొన్నారు. కెసిఆర్ పార్టీ ఓటమి తర్వాత తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు చాలా మంది ఎద్దేవా చేస్తున్నారు. వేణు స్వామి మాట మార్చారని అంటున్నారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందువల్ల, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదంటున్నారు జనాలు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

