Supritha : తప్పేముంది? మీకేం అన్యాయం చేశాను? సురేఖావాణి కూతురు సుప్రిత ఆవేదన
Supritha : సురేఖ వాణి కూతురు సుప్రీత తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది.
Supritha : టాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అగ్ర హీరోల సినిమాల్లో అక్క, అమ్మ, వదిన పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది ఈ వయసులోనూ యువ హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది సురేఖ వాణి. ముఖ్యంగా కూతురితో రీల్స్ చేయడం, డబ్బున్నోడు దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమె కూతురు సుప్రీతాకు కూడా సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది.
ఎలక్షన్ టైమ్ లో BRS పార్టీని గెలిపించడానికి చాలామంది సెలబ్రిటీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వీడియోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిలో సురేఖ వాణితో పాటూ కూతురు సుప్రీత కూడా ఉన్నారు. ముఖ్యంగా సుప్రీత కారు ముందు నిలబడి BRSను గెలిపించమని కోరుతూ వీడియో చేసింది. ఇక తాజాగా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆ వీడియోని డిలీట్ చేసి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.
ఈ ఫోటోని చూసిన నెటిజన్స్ ఈ తల్లి కూతుళ్ళపై రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియా అంతటా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో దాడి చేస్తున్నారు. తాజాగా దీనిపై సుప్రీత రియాక్ట్ అవుతూ.. "రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మొదట BRSకు సపోర్ట్ చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పాను. ఈ మాత్రానికి నన్ను ట్రోల్ చేయడమేంటి? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి" అంటూ సుప్రీత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
దీంతో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఎన్నికల ముందు BRS పార్టీ కోసం చాలామంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా రీల్స్ చేసి ప్రచారం చేశారు బుల్లితెర సీరియల్ నటీనటులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇలా చాలామంది ఎలక్షన్ టైం లో హైదరాబాద్ అభివృద్ధి గురించి చెబుతూ వీడియోలు తీసి వాటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వీళ్లంతా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కాబట్టి పెయిడ్ ప్రమోషన్స్ లో భాగంగా కూడా అలా చేసి ఉండవచ్చు. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకుని నెటిజన్స్ వాళ్లను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుండడంతో కొందరు సెలబ్రిటీస్ ఈ ట్రోలింగ్ తో ఇబ్బంది పడుతున్నారు.
Also Read : అసహ్యంగా ఉన్నానా అంటూ ఆర్తీ అగర్వాల్ ఏడ్చింది - నితిన్ భయపడేవాడు: అమ్మ రాజశేఖర్