అన్వేషించండి

Amma Rajashekar : అసహ్యంగా ఉన్నానా అంటూ ఆర్తీ అగర్వాల్ ఏడ్చింది - నితిన్ భయపడేవాడు: అమ్మ రాజశేఖర్

Amma Rajashekar : కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆర్తి అగర్వాల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Amma Rajashekar : టాలీవుడ్ లో ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ రాజశేఖర్. ఎక్కువగా మాస్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తమిళంలో స్టార్ కొరియోగ్రఫర్ గా పేరు తెచ్చుకున్న అమ్మ రాజశేఖర్ టాలీవుడ్ లో ఒకప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, నితిన్, గోపీచంద్ లాంటి స్టార్ హీరోస్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసి ఇక్కడ కూడా పాపులర్ అయ్యాడు.

కొరియోగ్రాఫర్ గా కెరియర్ సరిగ్గా సాగుతున్న సమయంలో దర్శకుడి అవతారం ఎత్తాడు. అందులో తీవ్రంగా దెబ్బతిన్నాడు. నితిన్ తో ‘టక్కరి’, గోపీచంద్ తో ‘రణం’ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత ఇండస్ట్రీకి చాలా కాలం పాటు దూరమయ్యాడు. మళ్లీ తెలుగులో బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని తన ఆట తీరుతో ఆకట్టుకున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..

ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్ లకు డ్యాన్స్ లో ఎంతో సపోర్ట్ చేశాను

"నేను తమిళంలో 200 సాంగ్స్ చేసిన తర్వాత ఎన్టీఆర్ సెకండ్ సినిమాలో కూచిపూడి సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏవెట్టి చేసావే సాంగ్ చేశాను. ‘సింహాద్రి’లో ‘‘నువ్వు విజిలేస్తే..’’ మాస్ సాంగ్ చేశాను. ఆ టైంలో ఎన్టీఆర్ కి డాన్స్ లో నేనే సపోర్ట్ చేశా. ఆ తర్వాత ప్రభాస్ కి సపోర్ట్ చేశా. ఈశ్వర్ ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు ప్రభాస్ కి ఆ టైంలో సినిమా అంటే తెలియదు. తర్వాత నితిన్ స్టార్టింగ్ లో కెమెరా దగ్గరికి వస్తేనే భయపడేవాడు. అతను ఫుల్ క్లాస్. అలాంటిది ఆయనలో మాస్ తీసుకొచ్చాను. అల్లు అర్జున్ తో బన్నీ సాంగ్ చేశాను. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరితో ఒక్కొక్క సాంగ్ మాత్రమే కొరియోగ్రఫీ చేశా" అని తెలిపారు

ఆర్తీ అగర్వాల్ నాతో తన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటుంది

‘‘ఆర్తి అగర్వాల్ తో ‘రణం 2’ తీశాను. షూటింగ్ మొదట్లో ఎంతో అందంగా వచ్చింది. ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ షెడ్యూల్ ప్లాన్ చేశాం. అప్పుడు చాలా లావై వచ్చింది. సెట్స్ లో ఆమె వచ్చిందని నాకు తెలియదు. తను కారవాన్ లో ఉంది. నేను ఆమె కోసం వెయిట్ చేస్తున్నా. రాకపోయేసరికి నేనే ఆమె దగ్గరికి వెళ్లాను. నాకు ఆర్తి అగర్వాల్ పర్సనల్ గా చాలా ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు తెలుసు. ఆర్తి అగర్వాల్ నాతో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో పాటు లవ్ ప్రాబ్లమ్స్ అన్ని విషయాలు షేర్ చేసుకొనేది. నేను ఆర్తి అగర్వాల్ దగ్గరికి వెళ్తే.. కారవాన్ లో కూర్చుని ఏడుస్తుంది" అని అన్నారు.

"ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే నేను వల్గర్ గా ఉన్నానా, అసహ్యంగా ఉన్నానా.. రాజశేఖర్ చెప్పు అని ఏడ్చేసింది. నువ్వు టెన్షన్ పడకు, కాస్ట్యూమ్ వేసుకుని ఒక షాట్ చేయి చాలు. ఆ తర్వాత రెండు నెలలు ఆగి షెడ్యూల్ పెడతా అని చెప్పాను. అప్పుడు షూటింగ్లో ఉన్న వాళ్లంతా ఆర్తి అగర్వాల్ బాగా లావైంది ఏంటి? అని అడిగితే అలా అవమని నేనే చెప్పాను. ఎందుకంటే ఈ మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో లావుగా కనిపించాలి. అందుకే నేను చెప్పాను అని ఆర్తి అగర్వాల్ కోసం వాళ్ళ అందరితో అలా చెప్పాను. అందుకే ఆ సినిమా తీయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. కాని చివరికి ఆమె చనిపోయిందని మెసేజ్ రావడం బాధ కలిగించింది" అంటూ అమ్మ రాజశేఖర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Also Read: ‘హాయ్ నాన్న’ ఉందా, ఊడిందా అనేది ఆ రాత్రే తేలిపోతుంది - నాని కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Delhi Election 2025 : హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం- కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు- బీజేపీతో కలిస్తోందని ఆరోపణలు
హీటెక్కిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం- కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు- బీజేపీతో కలిస్తోందని ఆరోపణలు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Embed widget