సినిమాలకు వెంకటేష్ బ్రేక్? ఇక అక్కడే మకాం? వైరల్ అవుతోన్న వెంకీ మామ వ్యాఖ్యలు
ప్రస్తుతం వెంకటేష్ గురించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. ఇలాంటి టైం లో ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది.
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలను అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకీ సినిమాలు ఫేవరేట్ గా ఉంటాయి. బ్యాగ్రౌండ్ తో వచ్చినా తన నటన, యాటిట్యూడ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ గురించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. ఇలాంటి టైం లో ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది.
వెంకటేష్ ఎప్పుడూ సినిమాల్లో బిజీగా గడుపుతుంటారు. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ప్రశాతంత కోసం రమణ మహర్షి ఆశ్రమంకు వెళ్తారని చాలా మందికి తెలుసు. ప్రస్తుతం వెంకటేష్ కి ఇదే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలా సార్లు ఆయన రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. తాను రమణ మహర్షి ఆశ్రమంలోనే ఎక్కువ కాలం గడిపానని, ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా.. ప్రశాంతంగా ఉండడం కోసం అక్కడే సమయాన్ని గడుపుతూ ఉంటానని ఓ సందర్భంలో వెంకటేష్ చెప్పారు. ఒక్కోసారి చెప్పా పెట్టకుండా అక్కడికి వెళ్లిపోయి.. అంతే సైలెంట్ గా మళ్ళీ వచ్చేస్తుంటారట ఆయన. దాని గురించి పెద్దగా ఎక్కడ బయట కూడా మాట్లాడరట. ఒకానొక టైంలో వెంకటేష్ చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
వెంకీ ప్రస్తుతం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలసి చేస్తున్న భారీ ప్రాజెక్టు 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2023 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హీరో రానా తో కలసి వెంకీ మామ అనే కొత్త వెబ్ సిరీస్ లో కూడా వెంకీ కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అలాగే ఈ డిసెంబర్ లో ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగులో కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
వెంకటేష్ గతంలో 'f3' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ నటన వింటేజ్ వెంకటేష్ ను గుర్తు చేసిందనే చెప్పాలి. తన యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ తో ఇరగతీసాడు వెంకీ. దర్శకుడు అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో 'f4' ను కూడా ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. అలాగే ఇటీవల విశ్వక్ సేన్ హీరో గా రూపొందించిన 'ఓరి దేవుడా' సినిమాలో స్పెషల్ రోల్ చేసి అలరించాడు వెంకీ. ప్రస్తుతం ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉండటంతో వెంకీ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారనే వార్త పై స్పష్టత లేదు. దీనిపై వెంకటేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.