News
News
X

Ori Devuda Release Date : దీపావళికి 'ఓరి దేవుడా' - స్టైలిష్ మోడ్రన్ భగవంతునిగా వెంకటేష్

విశ్వక్ సేన్ కథానాయకుడిగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా 'ఓరి దేవుడా'. దీపావళికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

FOLLOW US: 

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఓరి దేవుడా' (Ori Devuda Telugu Movie). తమిళంలో అశోక్‌ సెల్వన్‌, 'గురు' ఫేమ్‌ రితికా సింగ్‌ జంటగా నటించిన 'ఓ మై కడవులే' సినిమాకు రీమేక్‌ ఇది. ఒరిజినల్‌ సినిమాకు దర్శకత్వం వహించిన అశ్వత్‌ మారిముత్తు తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విశ్వక్ సేన్‌కు జంటగా హీరోయిన్ మిథిలా పాల్కర్‌ (Mithila Palkar) నటించారు. 

మోడ్రన్ భగవంతునిగా వెంకటేష్    
తమిళ సినిమా 'ఓ మై కడవులే'లో మోడ్రన్ భగవంతుని పాత్ర ఒకటి ఉంటుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దేవుడి ఆ రోల్ చేశారు. తెలుగులో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ చేస్తున్నారు. దేవుడు అనగానే కిరీటం, స్వర్గం వంటివి ఎక్స్‌పెక్ట్‌ చేయవద్దు. మోడ్రన్ మనిషిలా ఉంటారు. వైట్ షర్ట్, బ్లాక్ కోట్ వేసుకుని... మంచి కళ్ళజోడు పెట్టుకుని... బాస్ అన్నట్టు ఉన్నారు. 

Ori Devuda Surprise Glimpse : 'ఓరి దేవుడా' స‌ర్‌ప్రైజ్‌ గ్లింప్స్‌ పేరుతో ఈ రోజు వెంకటేష్ లుక్ రివీల్ చేశారు. ఆయన విజువల్స్ చూపించారు. అందులో ఆయన తనదైన మేనరిజంతో అలరించారు. 'లవ్ కోర్ట్'లో కేసులు పరిష్కరించే వ్యక్తిగా ఆయన కనిపించారు. వెంకీ అసిస్టెంట్ పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించారు. 

View this post on Instagram
 
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

దీపావళికి 'ఓరి దేవుడా' విడుదల
'ఓరి దేవుడా' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నట్లు పేర్కొన్నారు. హీరోగా విశ్వక్ సేన్ 6వ చిత్రమిది. వెంకటేష్, ఆయన కాంబినేషన్ సీన్స్ బాగా వచ్చాయని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. 

Also Read : ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' ఉండుంటే?
 
'ఓరి దేవుడా' చిత్రానికి పెరల్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి, 'దిల్‌' రాజు నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దాస్యం డైలాగులు రాస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండ‌గా... ఎడిట‌ర్‌గా విజ‌య్, సినిమాటోగ్రాఫ‌ర్‌గా విదు అయ్య‌న్న బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!

Published at : 21 Sep 2022 08:24 PM (IST) Tags: Venkatesh Vishwak sen Ori Devuda movie Ori Devuda Release On Diwali Ori Devuda Diwali Release

సంబంధిత కథనాలు

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

Rashmika: బాలీవుడ్ డెబ్యూ - రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్!

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా - ప్రచారంలో కొత్త టైటిల్స్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

NBK107: దసరా స్పెషల్ - బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్మెంట్!

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

Hanuman Teaser: రాముడి కోసం ‘హనుమాన్’ వెనక్కి - రిలీజ్‌లనే కాదు టీజర్లనూ వాయిదా వేస్తారా?

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!