Narappa Movie Release: థియేటర్లలో ‘నారప్ప’ మూవీ రి-రిలీజ్
డిసెంబర్ 13న విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘నారప్ప’ సినిమాను ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించిందట మూవీ టీమ్.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులు లేదా భారీ హిట్ అందుకొని పది, ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సినిమాలను థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హీరో వెంకటేశ్ సినిమాను కూడా రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 13న విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘నారప్ప’ సినిమాను ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించిందట మూవీ టీమ్. నిజానికి ఈ సినిమాను వెంకీ అభిమానులు థియేటర్లలో చూడాలని ఆశపడ్డారు. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ మూవీను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. డిజిటల్ వేదికపై ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు వెంకీ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాకు ‘నారప్ప’ సినిమా రిమేక్. ఒరిజినల్ వెర్షన్ లో తమిళ నటుడు దనుష్ నటించారు. ఒరిజినల్ సినిమాలో తెలుగు నేటివిటీ కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఓటీటీలో విడుదల చేశారు. అయితే ధనుష్ నటనతో కొన్ని పోలికలు వచ్చినా.. వెంకటేశ్ తన టాలెంట్ తో కథకు న్యాయం చేశారనే ప్రసంశలు అందుకున్నారు.
ఈ సినిమాను థియేటర్ లో చూడాలని ఆశపడిన ప్రేక్షకులకు ఇప్పుడా అవకాశం దక్కనుంది. దీంతో ఇప్పుడు వెంకీ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. తెలుగులో ఇప్పటికే కొంతమంది టాప్ హీరోలు పుట్టినరోజుల సందర్భంగా సినిమాలను 4K వెర్షన్ లో విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఆ ఒక్క రోజులోనే ఆ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా ఆ ఒక్క రోజులో ఊహించని స్థాయిలో కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. తర్వాత బాలకృష్ణ, ప్రభాస్ లాంటి టాప్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి భారీ కలక్షన్లు సాధించాయి.
ఇప్పుడు ఈ కోవలోకి విక్టరీ వెంకటేశ్ కూడా చేరిపోనున్నారు. అయితే వెంకటేశ్ సినిమా రీ రిలీజ్ కు మిగతా హీరోల సినిమాల రీ రిలీజ్ కూ చాలా తేడా ఉంది. అదేంటంటే.. ఇప్పటి దాకా రీ రిలీజ్ అయిన సినిమాలు అన్నీ థియేటర్ లో విడుదల అయిన సినిమాలు. ‘నారప్ప’ సినిమా మాత్రం ఓటీటీ వేదికగా విడుదల అయింది. సాధారణంగా థియేటర్ లో విడుదలైన తర్వాత సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం ఓటీటీ లో విడుదల అయ్యి మళ్లీ థియేటర్ లో విడుదల అవ్వబోతోంది. ఈ విషయంలో హీరో వెంకటేశ్ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. మరి వెంకీ బర్త్ డే వేడుకల సందర్భంగా వినూత్నంగా రీ రిలీజ్ అవ్వనున్న ‘నారప్ప’ థియేటర్ లో ఎంత మేరకు కలెక్షన్స్ సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? సుజిత్ పోస్టర్ డీకోడ్ చేస్తే
View this post on Instagram