Varun-Lavanya Engagement: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల లవ్ స్టోరీ అలా మొదలైందా? పెద్ద కథే నడిచిందిగా!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017 లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్ లో లావణ్యను కలిశాడు. అప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలోనూ ఈ జంట..
Varun-Lavanya Engagement: మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జూన్ 9 సాయంత్రం జరగనుందని సమాచారం. గత కొన్ని రోజులుగా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే జూన్ 8 న చిరంజీవి కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో నిశ్చితార్థం దాదాపు ఖాయమైంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లో వరుణ్ తేజ్ ఇంట్లోనే ఈ ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుకకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ అల్లు అరవింద్ తదితరులు నిశ్చితార్థానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
వరుణ్-లావణ్య లవ్ స్టోరీ..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా సెట్స్ లో లావణ్యను కలిశాడు. అప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలోనూ ఈ జంట సన్నిహితంగానే మెలిగేదట. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారిందట. అప్పటి నుంచే డేటింగ్ లో ఉన్నా కూడా ఈ విషయాన్ని రహస్యంగాను ఉంచింది ఈ జంట. తర్వాత ‘అంతరిక్షం’ సినిమాతో మళ్లీ కలిసి నటించారు వరుణ్-లావణ్య. ఈ సినిమా టైమ్ లోనే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక తర్వాత ఇద్దరూ ప్రయివేట్ పార్టీలలో కూడా కలిసి కనిపించారు. విశేషమేమిటంటే వరుణ్ చెల్లెలు నిహారిక వివాహానికి హాజరైన అతి కొద్ద మంది సన్నిహితుల్లో లావణ్ కూడా ఉంది. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు మొదలైయ్యాయి.
లావణ్యకు ప్రపోజ్ చేసిన వరుణ్..
కొన్నాళ్లు వరుణ్-లావణ్యల డేటింగ్ కొనసాగింది. తర్వాత డిసెంబర్ 15న లావణ్య పుట్టిన రోజు నాడు ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడట వరుణ్ తేజ్. ఆ తర్వాత ఇద్దరూ ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లికి ఆమోదం తెలిపారట. అయితే ఈ విషయాలన్ని ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇప్పటి వరకూ కూడా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఈ నిశ్చితార్థవ తర్వాత అయినా పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలను చెబుతారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే వరుణ్-లావణ్య ల పెళ్లి ఉంటుందని సమాచారం. జూన్ 9న ఇద్దరి ఎంగేజ్మెంట్ వార్తలు వచ్చినా.. ఇప్పటి వరకు చడీచప్పుడు లేదు. దీంతో లావణ్య, వరుణ్‌ల లవ్ మేటర్ మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదేమో అనే సందేహాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సంబంధించిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో పాటు మరోకొన్ని ప్రాజెక్టుల్లో నటించనున్నాడు వరుణ్. ఇక లావణ్య కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇక ఇద్దరూ పెళ్లి సమయానికి సినిమాలు పెండింగ్ ఏమీ లేకుండా ప్లాన్ చేసుకున్నారట. ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు ముందే చెప్పేశారని సమాచారం.