Varun Tej- Lavanya Tripati Wedding: పెళ్లి పనులు షురూ చేసిన వరుణ్, లావణ్య- మనీష్ మల్హోత్రాతో దుస్తుల డిజైన్
మరికొద్ది రోజుల్లోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టారు. తాజాగా పెళ్లి దుస్తుల డిజైన్ కోసం మనీష్ మల్హోత్రా స్టూడియోకి వెళ్లారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాల నడుమ ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి పీటల మీదికి ఎక్కబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెడ్డింగ్ ప్లానర్ ను కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మనీష్ మల్హోత్రా స్టూడియోకు లావణ్య, వరుణ్
మరికొద్ది రోజుల్లోనే వరుణ్, లావణ్య పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. తొలుత దుస్తులను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టూడియోకి వెళ్లారు. పెళ్లి డ్రెస్సులను ఆయనతో డిజైన్ చేయించుకోబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరు మనీష్ స్టూడియోకు వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాబోయే వధూవరులు ఇద్దరూ నడుచుకుంటూ స్టూడియోలోకి వెళ్లారు. లావణ్య సొట్టబుగ్గల్లో సిగ్గులు ఒలికిస్తూ అందంగా కనిపించింది.
View this post on Instagram
జూన్ 9న వైభవంగా నిశ్చితార్థం
వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్, అల్లు కుంటుంబంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే, ఎప్పుడు అనేది మాత్రం బయటకు తెలియడం లేదు.
‘మిస్టర్’ సినిమా నుంచే ప్రేమాయణం
వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం, పెళ్లి అనేది ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు. ఆల్రెడీ ఈ విషయం చాలా మంది తెలుసు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు.ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయ్యింది. కానీ, వరుణ్, లావణ్యలు మాత్రం లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్య పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో వరుణ్ తేజ్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8 ‘ఎయిర్ ఫోర్స్ డే’ నాడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు, మూడు సినిమాలు చేస్తోంది.
Read Also: ‘హాయ్ నాన్న‘లో ఫస్ట్ సాంగ్ రిలీజ్, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అబ్దుల్ వహాబ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial