Varalaxmi Sarath kumar: టమాటాల డిమాండ్ - నటి వరలక్ష్మీ శరత్ కుమార్ టమాటాల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ!
నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. రీసెంట్ ఆమె టమాటాల మీద ఓ వీడియో షేర్ చేసింది. అది నెట్టింట వైరల్ గా మారింది.
Varalaxmi Sarath kumar: ప్రస్తుతం మార్కెట్లో టామాటాలు ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకూ రూ. 100 నుంచి 150 మధ్యలో ఉన్న టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగి ఇప్పుడు కిలో రూ. 200 పైగానే ధర పలుకుతుంది. దీంతో టమాటా పేరు చెప్తేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ‘‘యా.. టమాటా లేకపోతే ముద్ద దిగదా’’ అంటూ ఎవరికివారే సర్ది చెప్పుకొని టమాటా లేని జీవితాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో టమాటా ధరలపై రోజు రోజుకూ మీమ్స్ పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలపై జోక్స్ పేలుస్తూ సరదాగా కొంత మంది పోస్ట్ లు చేస్తున్నారు. సినిమా తారలు కూడా టమాటాపై ఫన్నీ వీడియోస్ చేసి షేర్ చేస్తున్నారు. తాజాగా సినీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా టమాటాల విలువను తెలియజేస్తూ ఓ ఫన్నీ వీడియో చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వరలక్ష్మీ టమాటాల బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ..
సినీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా యాక్టివ్ గా ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఆమె టమాటాల మీద చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ గోడ దగ్గర నిలబడి మరొక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. తన వద్ద ఉన్న సెల్ ఫోన్, టామాటా బ్యాగ్ ను పక్కనే ఉన్న గోడ మీద పెడుతుంది. అది గమనించిన ఓ వ్యక్తి గోడ వెనుక నుంచి వచ్చి ఆమె సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లిపోతాడు. ఇది చూసిన మరో అమ్మాయి ఈ విషయాన్ని వరలక్ష్మీకి చెబితే ‘ఫోనే కదా పోతే పోనీ’ అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది. ఆమె స్పందించకపోవడంతో ఫోన్ దొంగలించిన వ్యక్తి ఈసారి మళ్లీ వచ్చి సెల్ ఫోన్ ను అక్కడే పెట్టేసి ఈసారి టమాటాలు ఉన్న బ్యాగ్ ఎత్తుకొనిపోతాడు. ఇది చూసిన వరలక్ష్మీ ఆ వ్యక్తి వెంబ పడుతుంది. ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎక్కడ చూసినా టమాటాల గురించే చర్చ..
మన దైనందన జీవితంలో టమాటాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటాయి. వాస్తవం చెప్పాలంటే... టమాటా లేకపోతే 90 శాతం కూరలు చేయలేము. అయితే మనం ఎప్పుడూ టమాటాకు అంతగా విలువ ఇవ్వం ఎందుకంటే అన్ని కూరగాయల ధరల కంటే టమాటా చాలా తక్కువ కాబట్టి. అందుకే టమాటాను కామెడీ కోసం సరదాగా జోకుల కోసం వాడుకుంటూ ఉంటాం. అయితే మనకి ఏదైనా సులువుగా దొరికితే దాని విలువ తెలియదు అంటారు. టమాటా విషయంలో ఇప్పుడది నిజమే అనిపిస్తుంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ తో సమానంగా టమాటా ధర పలుకుతుంది అంటే వాటికి ఎంత డిమాండ్ పెరిగిందో అర్థమవుతుంది. ఒకప్పుడు సరైన గిట్టుబాటు ధర రాక మార్కెట్లు వద్ద రోడ్డు మీద పడేసేవారు రైతులు ఇప్పుడు అదే టమాటా రైతులు పంట అమ్మి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ధరలు ఇంకా కొన్ని రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. అప్పటి వరకూ టమాటా మీద కోపం పెంచుకోకుండా ఇలాంటి ఫన్నీ మేమ్స్, వీడియోలు చూసుకుంటూ కాలం గడిపేయడమే అంటున్నారు సామాన్య ప్రజలు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ - కానీ ఒక షరతు, అదేంటంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial