అన్వేషించండి

Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ - కానీ ఒక షరతు, అదేంటంటే?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తోన్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. అయితే ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయిందనే వార్త ప్రచారంలో ఉంది. కానీ తాజాగా..

Ustaad Bhagath Singh: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘బ్రో’ సినిమా సూపర్ హిట్ అయింది. మూవీ మంచి పాజిటివ్ టాక్ తో సక్సెఫుల్ గా రన్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో ఇంకా రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఒకటి కాగా రెండోది హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్ లు  ఆకట్టుకున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా ఈ మూవీస్ షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఈ మధ్య ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ నిలిచిపోయిందనే టాక్ వచ్చింది. అయితే ఎన్నికలకు ముందే ఈ సినిమాను పవన్ కంప్లీట్ చేస్తానని హరీష్ కు మాటిచ్చారనే వార్త ఇప్పుడు పవన్ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది. 

ఎన్నికలకు ముందే ‘ఉస్తాద్ భగత్ సింగ్’..

పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాతే హరీష్ శంకర్ సినిమా చేస్తారనే వార్తలు మొన్నటి వరకూ వచ్చాయి. అయితే ఇప్పుడు టాక్ మారుతోంది. హరీష్ శంకర్ లాంటి మాస్ దర్శకులతో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే సినిమా చేయాలనేది పీకే ఫ్యాన్స్ కోరిక. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఏడాది కూడా సమయం లేకపోవడంతో ఓ వైపు వారాహి యాత్ర మరోవైపు పార్టీలో చేరికలతో బిజీ అయిపోయారు. ఈసారి ఎన్నికల్లో జనసేన ముద్ర గట్టిగా ఉంటుందని చెప్పిన పవన్ ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. అయితే హరీష్ శంకర్ సినిమాను మాత్రం వీలైతే ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అలాగే ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసే యోచనలో ఉన్నారట పవన్. 

30 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేస్తానంటేనే డేట్స్..

దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఎన్నికలకు ముందే ఈ సినిమాను ఎలాగైనా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే హరీష్ శంకర్ ఇటీవలే పవన్ ను కలవడానికి మంగళగిరి వెళ్లారట. అయితే అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని 30 రోజుల్లో తన పార్ట్ ను కంప్లీట్ చేయగలిగితేనే డేట్స్ ఇస్తానని క్లారిటీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. దీంతో త్వరలోనే పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొస్తానని అన్నారట హరీష్. పవన్ పూర్తిగా ఎన్నికల ప్రచారానికి వెళ్లకమునుపే ఈ సినిమాను కంప్లీట్ చేద్దామని హరీష్ కు హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది మూవీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందట టీమ్. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  ఫుల్ ఖుషీ అవుతున్నారట. ఎందుకంటే పవన్, హరీష్ కాంబోలో మూవీ అంటే పుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. ఆ విషయం ‘గబ్బర్ సింగ్’ సినిమా చూస్తే తెలుస్తోంది. అందుకే అలాంటి ఓ సాలిడ్ సినిమా ఎన్నికల ముందే పడాలని కోరుతున్నారట పవన్ ఫ్యాన్స్. మరి అభిమానుల కోరిక మేరకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఎన్నికలకు ముందు రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. 

Also Read: టాలీవుడ్‌లో ఈ నెల మూవీ జాతర - ఆగస్టులో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget