Vaishnav Tej: లేడీ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ - హీరోయిన్ ఎవరంటే?
నాగశౌర్యతో 'వరుడు కావలెను' అనే సినిమాను రూపొందించారు దర్శకురాలు సాయి సౌజన్య. ఆమె రెండో సినిమా వైష్ణవ్ తో చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలొచ్చాయి.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాహీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తరువాత వైష్ణవ్ కి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. దానికి తగ్గట్లే ఒక్కో సినిమాను ఒప్పుకుంటూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు వైష్ణవ్. ప్రస్తుతం అతడు నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
అలానే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు ఈ యంగ్ హీరో. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే మరో సినిమా ఒప్పుకున్నారు వైష్ణవ్ తేజ్. ఓ లేడీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు వైష్ణవ్ తేజ్.
నాగశౌర్యతో 'వరుడు కావలెను' అనే సినిమాను రూపొందించారు దర్శకురాలు సాయి సౌజన్య. ఈ సినిమా ఏవరేజ్ గా ఆడింది. ఆమె రెండో సినిమా వైష్ణవ్ తో చేయబోతున్నట్లు ఇదివరకు వార్తలొచ్చాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారట.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. అలానే పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఓ సినిమాలో వైష్ణవ్ తేజ్ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. త్రివిక్రమ్ ఈ సినిమాకి కథ అందిస్తున్నారట.
Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?
Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్
View this post on Instagram