News
News
X

Urfi Javed Life Threat: ఉర్ఫీ జావేద్‌కు దారుణమైన బెదిరింపులు, వ్యక్తి అరెస్టు

గత రెండేళ్లుగా బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ను వాట్సాప్ లో బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతని పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ నటి, ఓటీటీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని టివి షోలతో ఉర్ఫీ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె వేసుకునే వెరైటీ బోల్డ్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇటీవల ఉర్ఫీకి సోషల్ మీడియాలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. అత్యాచారం చేసి హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి ఆమెకు వాట్సాప్‌లో బెదిరింపు మెసేజులు పంపాడు. దీంతో ఉర్ఫీ గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉర్ఫీ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు ముంబైకు చెందిన నవీన్ గిరి అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండేళ్లుగా ఉర్ఫీను రేప్ చేస్తానని, చంపేస్తానని నవీన్ వాట్సాప్ లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నెంబర్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. 

ఇదే విషయం పై గతంలో ఉర్ఫీ సోషల్ మీడియా వేదికపై పలుమార్లు పోస్ట్ లు చేసింది. తనను ఓ వ్యక్తి గత రెండేళ్ళుగా బెదిరిస్తున్నాడని తెలిపింది. తన ఫోటోను మార్ఫింగ్ చేసి తనకు పంపించి న్యూడ్ వీడియో కాల్ చేయాలని, తనతో కలవాలని బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. దీనిపై గుర్గావ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా.. వాళ్లు పట్టించుకోలేదని పేర్కొంది. మూడేళ్లుగా అతను నరకం చూపిస్తున్నాడని వాపోయింది. అతను మాత్రం స్వేఛ్చగా బయట తిరుగుతున్నాడని చెప్పింది. అతని వల్ల సమాజానికి, ముఖ్యంగా మహిళలకు ప్రమాదమని పేర్కొంది. అతని ఫోటోతో పాటు అతను చాట్ చేసిన స్క్రీన్ షార్ట్ లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉర్ఫీ. ఇది జరిగి చాలా రోజులు గడిచింది. దీనిపై అప్పట్లో నెటిజన్స్ కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేశారు. అయితే ఈ మధ్య ఉర్ఫీకు వేధింపులు ఇంకా ఎక్కువ అవ్వడంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ వ్యవహారం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఉర్ఫీ జావేద్ కు ఇలాంటి కాంట్రవర్సీలు మాత్రం కొత్తమీ కాదు. ఆమె ధరించే డ్రెస్ లపై ఎప్పుడూ ఏదొక విమర్శ వస్తూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్ లో కొంత మంది ప్రముఖులు కూడా ఆమె ధరించే దుస్తులపై కామెంట్లు చేశారు. అయినా ఉర్ఫీ మాత్రం తగ్గేదేలే అంటూ రోజుకోరకం కొత్త డ్రెస్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తన బోల్డ్ డ్రెస్ లతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది ఉర్ఫీ. తాను ట్రెండింగ్ లో ఉండటం కోసం చేతికందిన ప్రతీదానితో కాదేదీ డ్రెస్సుల తయారీకి అనర్హం అన్న చందంగా వెరైటీ వెరైటీ బోల్డ్ డ్రెస్ లతో ఇంటర్నెట్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది ఉర్ఫీ.

Read Also: అరెరే ‘అవతార్-2’ ఎంత పనిచేసింది - జపాన్ థియేటర్లకు ఊహించని దెబ్బ, పాపం ప్రేక్షకులు

Published at : 22 Dec 2022 05:33 PM (IST) Tags: Urfi Javed Urfi Javed Movies Urfi

సంబంధిత కథనాలు

Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్

Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!

Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం

Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?

Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర

Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు

SBI Q3 Result: రికార్డ్‌ సృష్టించిన స్టేట్‌ బ్యాంక్‌, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు