By: ABP Desam | Updated at : 09 Jun 2023 01:27 PM (IST)
ఉర్ఫీ జావేద్ (Photo Credit:BollywoodMDB/Instagram)
ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వింత వింత డ్రెస్సులకు ఆమె పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఆమె చేసుకునే డ్రెస్సులు చూసి నెటిజన్స్ తలలు బాదుకుంటారు. ఎవరు ఏమన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తనకు నచ్చిన డ్రెస్సింగ్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తాజాగా ఉర్ఫీ జావేద్ వేసుకున్న నీలం రంగు డ్రెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తల నుంచి కాళ్ల వరకు నిండుగా డెనిమ్ గౌను వేసుకుని కనిపించింది. నీలిరంగు డ్రెస్సుకు తోడు ఉర్ఫీ జావేద్ బ్రైట్ రెడ్ బ్లాక్ హీల్స్ ధరించింది. గౌనుకు తోడు చేతులకు స్లీవ్‌లు వేసుకుంది. ఈ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పటిలాగే వింత డ్రెస్స్ తో మళ్లీ తెగ వైరల్ అవుతోంది. ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా, మరికొంత మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫీని చూస్తుంటే క్రిష్ సినిమాలో జాదు మాదిరిగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది ఏలియన్ లా ఉందని పోస్టులు పెడుతున్నారు.
ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి BB OTT కంటెస్టెంట్ ఆమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి. ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అటు బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది.
2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది. ఉర్ఫీ జావేద్ అక్టోబర్ 15, 1997న లక్నోలో జన్మించింది. ఆమెకు అస్ఫీ జావేద్ అనే సోదరి ఉంది. ఆమె లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ లో పట్టా అందుకుంది. ఉర్ఫీ జావేద్ వెరైటీ డ్రెస్సులతోనే బాగా పాపులర్ అయ్యింది. ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి.
Read Also: డబ్బులిచ్చి నన్ను తిట్టిస్తున్నారు, అది విజయ్ మనిషి పనే: అనసూయ
Krishna Mukunda Murari September 26th: ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ- కొడుకు మీద చెయ్యెత్తిన రేవతి!
Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
Mangalavaram Movie Release : నవంబర్లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
Brahmamudi September 26th Episode: రాజ్ ని ఓడించిన కళావతి - కళ్యాణ్ ని చితక్కొట్టిన అప్పు- స్వప్న కిడ్నాప్!
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
TS TET 2023 Results: టీఎస్ టెట్-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు
/body>