అన్వేషించండి

డబ్బులిచ్చి నన్ను తిట్టిస్తున్నారు, అది విజయ్ మనిషి పనే: అనసూయ

గత కొంత కాలంగా హీరో విజయ్ దేవరకొండ తో జరుగుతున్న ఈ కోల్డ్ వార్ పై అనసూయ స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విజయ్ తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చింది.

Anasuya: గత కొంత కాలంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే అనసూయ సోషల్ మీడియాలో విజయ్ కు వ్యతిరేకంగా పోస్ట్ లు చేసుకుంటూ వస్తుంది. ఈ పోస్ట్ లపై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. ఇది ఇలా కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. విజయ్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా అనసూయ ఒకటి రెండు సార్లు పోస్ట్ లు చేసింది. ఇటీవల విజయ్ నటించిన ‘ఖుషి’ సినిమా పోస్టర్ లో ది విజయ్ అని ఉండటంపై కూడా అనసూయ ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేసింది. దీని తర్వాత ఈ వివాదం మరింత ముందిరింది. అయితే తాజాగా అనసూయ ఈ కోల్డ్ వార్ పై స్పందించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విజయ్ తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చింది. అంతే కాదు, ఇకపై తాను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని మనసులో మాట బయటకు చెప్పింది. 

డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్: అనసూయ

అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “2019లో, విజయ్ దేవరకొండ తండ్రి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో నేను కూడా నటించాను. అప్పటి వరక అంతా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ టీమ్‌లోని ఒకరు నన్ను తిట్టడానికి ఆయన పబ్లిసిస్ట్ (ప్రచారకర్త) నన్ను ట్రోల్ చేయడం కోసం కొందరికి డబ్బులిచ్చిన్నట్లు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. పబ్లిసిస్ట్ పెయిడ్ ట్రోల్స్ చేసి ఉంటే విజయ్‌కి తెలిసే ఉంటుంది కదా. అతనికి తెలియకుండా వారు ఇలాంటి పని చేయరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఇది సరైనదేనా?’’ అని మండిపడింది.

వాస్తవానికి విజయ్, తాను మంచి స్నేహితులం అని అనసూయ చెప్పింది. ఇద్దరం కలసి పలు సినిమాల్లో కూడా నటించామని తెలిపింది. ఎప్పుడూ మంచి స్నేహితుల్లానే ఉండేవాళ్లమని, అయితే ‘అర్జున్ రెడ్డి’ ఘటన తర్వాత ట్రోల్స్ మొదలవ్వడంతో దీని వెనుక విజయ్ హస్తం కూడా ఉందని అనుకున్నానని చెప్పింది అనసూయ. అయితే విజయ్ తన మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నాడో తెలియదని, అయినా ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దామని అనుకుంటున్నానని వెల్లడించింది. తాను మానసికంగా ప్రశాంతత కోరుకుంటున్నానని ఇవన్నీ పక్కనపెట్టి జీవితంలో ముందుకు సాగాలని అనుకుంటున్నానని తెలిపింది అనసూయ. మరి ఈ వివాదం అనసూయ కామెంట్స్ తో ముగుస్తుందా లేదా అనేది చూడాలి.

అనసూయ-విజయ్ కు మధ్య వివాదం ఏంటి? 

గతంలో విజయ్ దేవరకొండ సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా లో కొన్ని బోల్డ్ డైలాగ్ లను మ్యూట్ చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు విజయ్ ఓ థియేటర్ విజిట్ కు వెళ్లాడట. అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ సినిమాలో మ్యూట్ చేసిన బోల్డ్ డైలాగ్ లను అక్కడున్న యూత్ తో పలికించే ప్రయత్నం చేశాడట విజయ్. ఆ విషయం పై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ తల్లిగా ఆ విషయం తనను బాధించిందని, అలా చేయొద్దు అని విజయ్ కు చెప్పింది. ఆ తర్వాత నుంచే తనపై ట్రోల్స్ మొదలయ్యాయని చెప్పింది అనసూయ. 

Also Read: అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget