Urfi Javed Beach Video: బీచ్‌లో నిండు దుస్తులతో షాకిచ్చిన ఉర్ఫీ జావెద్, ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
ఎప్పుడూ వెరైటీ బోల్డ్ డ్రెస్ లతో నిత్యం వార్తల్లో ఉండే ఉర్ఫీ జావేద్ షాకిచ్చింది. నిండైన దుస్తులతో బీచ్ లో నడుస్తూ అందరినీ ఆశ్చర్యరానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఓటీటీ ‘బిగ్ బాస్’ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్. ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ కూడా ఉర్ఫీనే. బిగ్ బాస్ తర్వాత ఉర్ఫీ కొన్ని టీవీ షోలలో నటించింది. ఆమె చేసే పనులు కంటే ధరించే దుస్తులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో వెరైటీ డ్రెస్సులతో దర్శనమిచ్చే ఉర్ఫీ ఇప్పుడు అందరకీ షాకిచ్చింది. బీచ్ లో నిండు దుస్తులతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఉర్ఫీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండీగా ఉండటానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుంటుంది ఉర్ఫీ. అందుకోసం వెరైటీ వెరైటీ డిజైన్లతో బట్టలు తయారు చేయించుకుంటుంది. ఆకులు, పువ్వులు, గాజు ముక్కలు, గుడ్డముక్కలు ఇలా ఏవీ నచ్చితే వాటితో ఓ డ్రెస్ డిజైన్ చేసుకుని.. వాటిని ధరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అర్థనగ్న ప్రదర్శనలతో అందర్నీ తికమక చేసి సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన క్రేజ్ ను కాపాడుకునేందుకు ఇలాంటి అడ్డదారులు తొక్కుతోందనే విమర్శలు వస్తున్నా తను మాత్రం అదే కంటిన్యూ చేస్తూ వెళ్తోంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఆమె సల్వార్ సూట్ లో నిండైన దుస్తులతో కనిపించి ఆకట్టుకుంది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సల్వార్ సూట్ లో కనిపిస్తోంది నిజంగా ఉర్ఫీయేనా, అయితే సూర్యుడు పడమర ఉదయించినట్టే అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఆ వీడియోని షేర్ చేస్తున్నారు.
View this post on Instagram
ఉర్ఫీ ఏం చేసినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. ఈ మధ్య తన వెరైటీ డ్రెస్సులను పక్కనపెట్టి చీరలో మెరిసింది. ముంబై ఎయిర్పోర్ట్ లో పలుచని గులాబీ రంగు చీర కట్టులో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ చీరతో చాలా ఇబ్బంది పడినట్లు కనిపించింది. గాలికి ఎగిరిపోతున్న ఆ చీరను సరిచేసుకోలేక పడరాని పాట్లు పడింది ఉర్ఫీ. ఈ వీడియో కూడా ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది.
Also Read : 'జగమే మాయ' రివ్యూ : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ధన్యా బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
ఉర్ఫీ జావేద్ లక్నోలో జన్మించింది. ఆమె లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ లో పట్టా సాధించింది. పరాస్ కల్నావత్ తో రిలేషన్ షిప్ లో ఉంది ఉర్ఫీ. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ క్యారెక్టర్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2 లో కూడా కనిపించింది ఉర్ఫీ. స్టార్ ప్లస్ లో ‘చంద్ర నందిని’లో ఛాయా గానూ, ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి గా కనిపించింది. ఇక 2020 లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా గా చేసింది. తర్వాత ‘కసౌతి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి గా నటించింది ఉర్ఫీ.