By: ABP Desam | Updated at : 05 Jun 2023 12:43 PM (IST)
థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు(Photo Credit: Social Media)
ఎప్పటి లాగే ఈ వారం కూడా చాలా సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యాయి. గత కొద్ది రోజులుగా చిన్న సినిమాలే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ వారం కూడా చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇంతకీ జూన్ రెండో వారంలో ప్రేక్షకులను అలరించే చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..
‘టక్కర్’- జూన్ 9న విడుదల
సిద్దార్థ్ హీరోగా కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్కర్’. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్, యాక్షన్ మూవీగా ‘టక్కర్’ రూపొందింది. ఆశ అనేదే ఈ లోకాన్ని నడిపిస్తుంది, ఆ అనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఆశను నెరవేర్చుకోవాలంటే డబ్బు కావాల్సిందే అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
‘అన్‌స్టాపబుల్’- జూన్ 9న విడుదల
వి.జె. సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు రూపొందించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. రజిత్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చూస్తే ఒత్తిడి అనేది తగ్గిపోతుందని, రెండు గంటల పాటు అందరూ హాయిగా నవ్వుకోవచ్చని చిత్రబృందం వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 9న విడుదల కానుంది.
‘విమానం’- జూన్ 9న విడుదల
సముద్రఖని, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్‌రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నారు. జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరయ్య దివ్యాంగుడు అయినా కొడుకుని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాడు. కొడుకు ఎప్పుడూ విమానం ఎక్కాలని కోరుకుంటాడు. చివరకు ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే.
‘పోయే ఏనుగు పోయే’ - జూన్ 9న విడుదల
మాస్టర్ శశాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పోయే ఏనుగు పోయే’. కె.ఎస్.నాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పవనమ్మాళ్ కేశవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏనుగు చుట్టూ తిరిగే కథతో రూపొందించిన ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోనీలివ్
2018- జూన్ 07న విడుదల
నెట్‌ఫ్లిక్స్
బర్రకుడ క్వీన్స్ (వెబ్‌సిరీస్) జూన్ 05న విడుదల
ఆర్నాల్డ్ (వెబ్‌సిరీస్) జూన్ 07న విడుదల
అమెజాన్ ప్రైమ్
మై ఫాల్ట్ (హాలీవుడ్) జూన్ 08న విడుదల
జీ5
ది ఐడల్ (వెబ్‌సిరీస్) జూన్ 5న విడుదల
డిస్నీ+హాట్‌స్టార్
అవతార్: ది వే ఆఫ్ వాటర్ (హాలీవుడ్) జూన్ 07న విడుదల
జియో సినిమా
బ్లడ్ డాడీ (హిందీ) జూన్ 09
యూపీ 65 (హిందీ సిరీస్) జూన్ 08
Read Also: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి
/body>