అన్వేషించండి

Upasana Konidela: ఉపాసన కోసం చిరు తల్లి స్పెషల్ వంటకం - ఇంకేం కావాలంటూ మెగా కోడలు ఆనందం

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మెగా కోడలిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఉపాసనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

Upasana Konidela: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మెగా కోడలి గానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఉపాసనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ లు ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంది. ఇక చిరంజీవి, రామ్ చరణ్ లు ప్రస్తుతం దగ్గరదగ్గర్లోనే నివాసం ఉంటున్నారన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్-ఉపాసనలు కూడా ఇటీవలే తమ ఇంటిని తమకు నచ్చినట్టు మార్చుకున్నారు. దీంతో ఏ సందర్బం వచ్చినా రామ్ చరణ్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం సందర్భంగా రామ్ చరణ్ దంపతులు చిరంజీవి ఇంట్లో గడిపినట్టుగా తెలుస్తోంది. తాజాగా మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో చరణ్ దంపతులు సండే స్పెషల్ గా చిరంజీవి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఇంతకీ ఉపాసన షేర్ చేసిన వీడియో ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి దగ్గరుండి వంట చేయిస్తున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరిస్తున్నట్టుగా, ఎలా వేయాలో ఎంత వేయాలో అంజనా దేవీ చెప్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. వీడియో చూస్తుంటే మెగా కోడలు ఉపాసన కోసమే ఆ వేడి వేడి వంటకాన్ని సిద్దం చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అంతే కాదు దానికి స్పెషల్ గా ఓ నోట్ ను రాసుకొచ్చింది. ‘ప్రేమతో నిండిపోయిన సండే స్పెషల్ పులావ్, ఇంతకంటే నాకేం కావాలి’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. ఇది చూసి మెగా అభిమానులు మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇక రామ్ చరణ్ ఉపాసన ఇటీవలే ఫారిన్ టూర్ ను ముగించుకొని వచ్చారు. ఈ టార్ కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. త్వరలోనే రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే ఉపాసనను ఎంతో కేరింగ్ గా చూసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ. మరోవైపు ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. మరోవైపు మెగా అభిమానులు కూడా వారుసుడి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ ప్రాజెక్టులో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీకు ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. హీరోయిన్ గా కియార అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vignesh Shivan : LIK మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - నెగిటివ్ రివ్యూస్‌పై నయనతార భర్త ఎమోషనల్
LIK మూవీకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ - నెగిటివ్ రివ్యూస్‌పై నయనతార భర్త ఎమోషనల్
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Dil Raju vs Mythri: 'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు
'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget