By: Suresh Chelluboyina | Updated at : 19 Dec 2022 12:49 PM (IST)
Image Credit: AHA
అలనాటి అందాల తారలు జయప్రద, జయసుధ చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసి కనిపించబోతున్నారు. సినిమాలో మాత్రమే కాదండోయ్ బాలకృష్ణ షో ‘అన్‌స్టాపబుల్-2’లో వీరిద్దరూ కలిసి వస్తున్నారు. వారితోపాటు నటి రాశీ ఖన్నా కూడా సందడి చేయనుంది. ఈ ట్రిపుల్ ధమాకా షో త్వరలోనే ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ‘ఆహా’ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. త్వరలోనే ప్రోమోను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ ఓటీటీ రికార్డులను బద్దలకొడుతోంది. అత్యంత వ్యూస్ కలిగిన ఓటీటీ షోగా దూసుకెళ్తోంది. త్వరలో టాలీవుడ్ ఫ్రెండ్స్ ప్రభాస్, గోపీచంద్ సైతం బాలయ్యతో కలిసి రచ్చ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్, గోపీ చంద్‌ల ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండవుతోంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన ప్రీమియర్ కానుంది.
ఇటీవల విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ‘ఇక నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలి’ అని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరారు. దానికి ప్రభాస్ ‘అలాగే డార్లింగ్ సార్’ అని రిప్లై ఇచ్చారు. ‘శర్వానంద్ పెళ్లి ఎప్పుడు నీ పెళ్లి తర్వాతనే అన్నాడు.’ అని బాలకృష్ణ అంటే... ‘ఇక నా పెళ్లి గురించి అడిగితే సల్మాన్ ఖాన్ తర్వాతే అనాలేమో.’ అని ప్రభాస్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. మధ్యలో రామ్ చరణ్‌కు కూడా కాల్ చేశారు. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ మళ్లీ ఈ గ్లింప్స్‌లో కనిపించింది. చివర్లో ‘ఏవండీ... ఒక పాట పాడండి.’ అంటూ ఈ ప్రోమోను ముగించారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కూడా ఒక ఎపిసోడ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. దీన్ని ‘ఆహా’, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ ఇప్పటికే టీజ్ చేశారు. 27వ తేదీన ఈ ఎపిసోడ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చారు. ఆ తర్వాత ఎపిసోడ్లకు అడివి శేష్, శర్వానంద్ ఒక ఎపిసోడ్‌కు, విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఒక ఎపిసోడ్‌కు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక ఒక ఎపిసోడ్‌కు విచ్చేశారు.
Read Also: ఎన్నారైలను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు
Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!
Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?