By: ABP Desam | Updated at : 08 Feb 2023 12:35 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@ahavideoin/instagram
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్' విజయవంతంగా ఫస్ట్ సీజన్ పూర్తి అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్ చివరి మజిలీకి చేరుకుంది. సెకండ్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు అతిథిగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఫస్ట్ పార్టు సరదాగా సాగింది. మూడు పెళ్లిళ్ల గురించి పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆయనతో పాటు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాసేపు సందడి చేశారు. పెళ్లిళ్లు, సాయి తేజ్ రోడ్ యాక్సిడెంట్ మినహా అందులో సీరియస్ టాపిక్స్ లేవు. ఈ ఎపిసోడ్ ఇప్పటికే సెన్సేషనల్ రికార్డులు సృష్టించింది. రెండో పార్టు అయితే అంతకుమించి అనేలా ఉంటుందట. కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు... 'అన్‌స్టాపబుల్ 2' పవర్ ఫైనల్ పార్ట్ 2లో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి 'ఆహా' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ షోకు సంబంధించిన చిన్న క్లిప్ ను ‘ఆహా’ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఓ బామ్మ పవన్ గురించి చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. కరోనా కష్ట కాలంలో తన ఇద్దరు కొడుకులు చనిపోయారని, ఇంకో కొడుకు ఉన్నాడని, అతడికి పవన్ అండగా నిలిచారని చెప్పింది. పవన్ రుణం జీవితంలో తీర్చుకోలేనిదని చెప్పింది. ఈ సందర్భంగా షో హోస్టుతో పాటు అందరూ కంటతడి పెట్టారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూసి చనిపోవాలనేదే తన కోరిక అని బామ్మ చెప్పింది. ఆమె మాటతో షోలో చప్పట్ల మోత మోగింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ యాంకరింగ్‌కు కొత్తదనం తీసుకువచ్చారు బాలయ్య. సరదాగా ఆట పట్టిస్తూనే ప్రేక్షకులను కావాల్సిన సమాధానాలను అతిథుల నుంచి రాబడుతున్నారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఆడియన్స్ కోరుకుంటున్నట్లుగానే వారి అభిమాన తారలను తీసుకువస్తూ అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెట్ అందిస్తున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీర మల్లు' సినిమా చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
Read Also: విశాఖలో ‘పుష్ప-2’ షూటింగ్ కంప్లీట్ - వీరాభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ
Orange Re-release Trailer: ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్, కొత్త ట్రైలర్ భలే డిఫరెంట్‌గా ఉందే!
Venkatesh's Saindhav Update : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?
షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!
Actress Hema: ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన నటి హేమ
‘రంగస్థలం’ + ‘బాహుబలి’ = నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ - చెప్పుకోండి చూద్దాం!
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!