Pushpa 2 Update: విశాఖలో ‘పుష్ప-2’ షూటింగ్ కంప్లీట్ - వీరాభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ
వైజాగ్ లో ‘పుష్ప-2’ షూటింగ్ పూర్తయ్యింది. సుమారు 18 రోజుల పాటు విశాఖలో షూటింగ్ కొనసాగింది. చివరి రోజు ఫ్యాన్స్ తో బన్నీ సరదాగా గడిపారు. వైజాగ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అంటూ ఓ పోస్టు పెట్టారు.
‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, ‘పుష్ప-2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తొలి భాగంతో పోల్చితే రెండో భాగం గ్రాండ్ గా ఉండేలా దర్శకుడు సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వారిలో జోష్ నింపుతున్నారు.
అభిమానులతో పుష్పరాజ్ సందడి
‘పుష్ప-2’కు సంబంధించి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. తాజాగా వైజాగ్ షెడ్యూల్ ను సైతం కంప్లీట్ చేశారు. ‘పుష్ప–2’ సినిమా షూటింగ్ కోసం గత నెల 20న బన్నీ విశాఖపట్నం వెళ్లారు. ఫిషింగ్ హార్బర్, పోర్టు, అప్పుఘర్ సహా పలు ప్రాంతాల్లో 18 రోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా గాదిరాజు ప్యాలస్, రుషికొండలోని రాడిసన్ బ్లూలో అభిమానులతో ఫొటో షూట్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వీరాభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు వచ్చాడు. దివ్యాంగుడై అతడిని అల్లు అర్జున్.. ఎత్తుకుని ఫొటో దిగారు. అనంతరం వైజాగ్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
Million Dollar Pic...🤩
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) February 7, 2023
His love for his fans..@alluarjun 🙏❤️ pic.twitter.com/CZ8LnhkuGQ
— C/o.AlluArjun (@CareOfAlluArjun) February 6, 2023
అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్టు
వైజాగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వైజాగ్ బీచ్‌లో అలలకు ఎదురుగా నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. సముద్రం ఒడ్డున ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించారు. థ్యాంక్యూ వైజాగ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బన్నీ పోస్ట్ షేర్ చేశారు. విశాఖపట్నం తనకు ఎప్పుడూ స్పెషల్ అంటూ లవ్ సింబల్ తో షేర్ చేశారు. అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
@alluarjun bids goodbye to Vizag post #PushpaTheRule Shoot with an amazing click by the beach!🌊❤️🔥#AlluArjun pic.twitter.com/IEtzbMC5n3
— Maduri Mattaiah (@madurimadhu1) February 7, 2023
హైదరాబాద్ లో తదుపరి షూటింగ్
వైజాగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో తర్వాత తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా యూనిట్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగేలా దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుంది. మొదటి భాగంలో శ్రీవల్లిగా కనిపించి హీరోయిన్ రష్మిక మందన్న, ఈ భాగంలో మరింత ఆకట్టుకునేలా దర్శకుడు రూపొందిస్తున్నారట. తొలి భాగంలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ క్యారెక్టర్ సైతం ఈ భాగంలో మరింత ఎఫెక్టివ్ గా కనిపించనుందట. అంతేకాదు, అనసూయ ఇందులో ఓ ఐటెం సాంగ్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read Also: అది నాకు కలిసి రాలేదు, ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లయ్యింది - సాయి ధరమ్ తేజ్ కామెంట్స్