Unstoppable with NBK Teaser release: ‘అన్‌స్టాపబుల్ 2’ టీజర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!
‘అన్‌స్టాపబుల్ 2’ ట్రైలర్: మరింత జోష్‌తో బాలయ్య ఎంట్రీ, ఈ సారి డబుల్ ధమాకా!
ఇన్నాళ్లు బాలకృష్ణ సినిమా వస్తుందంటనే అభిమానుల్లో పూనకాలు వచ్చేసేవి. థియేటర్లు కేరింతలు, బాలయ్య బాబు నినాదాలతో దద్దరిల్లేవి. అలాంటి బాలయ్య బుల్లితెరపై ఓ టాక్ షోలో కనిపిస్తున్నారంటే అభిమానులు ఊరుకుంటారా? టీవీలకు అతుక్కుపోరూ. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ సీజన్‌లో అదే జరిగింది. ఆ షో చూసేందుకు అభిమానులు టీవీలకు, మొబైళ్లకు అతుక్కుపోయారు. ‘ఆహా’ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ సైతం అమాంతంగా పెరిగిపోయాయి. ఐఎండీబీలో టాక్ షో అన్నింటిలోనూ ఈ షో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ షో రెండో సీజన్ ప్రారంభానికి అంతా రెడీ అయ్యింది.
ఇప్పుడు ఆ షో రెండో సీజన్ మొదలవుతోంది. Unstoppable with NBK - 2 బాలయ్య మరోసారి వినోదాన్ని పంచేందుకు వచ్చేస్తున్నారు. మాటల తూటాలతో కితకితలు పెడుతూనే తోటి తారల గుట్టులాగేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తు్న్నారు. ఈ సారి రెట్టింపు ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 4న) విజయవాడలో అంగరంగ వైభవంగా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సింగర్స్ బాలకృష్ణ పాటలతో హుషారు నింపారు. ఈ వేదికపై ‘ఆహా’లో త్వరలో ప్రసారం కానున్న మరికొన్ని ప్రోగ్రామ్స్, టీజర్స్ ప్రకటించారు. మరి, బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2’ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి మరి.
ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇందులో బాలయ్య పాడుబడిన గుహలో నిధిని అన్వేషిస్తున్నట్లుగా కనిపించారు. ‘ఇండియానా జోన్స్’ తరహాలో పొడవైన కత్తి, చేతిలో కొరడాతో కనిపించారు. భలే స్టైలిష్‌గా అభిమానులను అలరించే గెటప్‌లో బాలయ్య ప్రత్యక్షమయ్యారు. అయితే, ఈ టీజర్ కేవలం 56 సెకన్లు మాత్రమే ఉంది. త్వరలోనే పూర్తి నిడివితో ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చిరంజీవి, నాగార్జునలు పాల్గొనే అవకాశాలున్నట్లు బాలయ్య హింట్ ఇచ్చారు. అయితే, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందనేది త్వరలోనే ప్రకటిస్తారు.
ఈ సందర్భంగా బాలయ్య ‘అన్‌స్టాపబుల్ - 2’ షో గురించి మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా మొదటి సీజన్ కంటే రెండో సీజన్ భారీ విజయాన్ని అందుకుంటుంది. ఏమీ ఆశించకుండా అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేం. సినిమాలు చేసుకుంటూ ఈ మాధ్యమంలోకి అడుగు పెట్టాను. ఇందులో ముందు ముందు చాలా అద్భుతాలు రాబోతున్నాయి. దీని కోసం అందరూ అందించిన సహకారాన్ని మర్చిపోలేం. ఇలా అందరి కలయికే ఈ అన్‌స్టాపబుల్. నేను అడుగు పెట్టిన ఈ మాధ్యమంలో నా ప్రయత్నాని విజయాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
‘ఆహా’లో కొత్త షోస్, సీరిస్, మూవీస్ ఇవే
కామెడీ స్టాక్ ఎక్సైంజ్ (స్టాండప్ కామెడీ షో): సుధీర్, సద్దాం, యాదమరాజు, హరి, వేణు, అవినాష్‌లతో కామెడీ షో ప్రారంభం కానుంది.
ఇంటింట రామాయణం: రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘ఆహా’ ఒరిజినల్ వెబ్ సీరిస్ ఇది. నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.
పాపం పసివాడు: సింగర్ శ్రీరామచంద్ర నటించిన కొత్త వెబ్ సీరిస్ ఇది. గాయత్రి, విద్య, రాసి తదితరులు నటిస్తున్నారు.
బాలుగాని టాకీస్: సినిమా