అన్వేషించండి

Unstoppable2 With Prabhas : టర్కీలో బాలకృష్ణ కంటతడి, ఆస్పత్రిలో ప్రభాస్ - కృష్ణంరాజుకు 'అన్‌స్టాపబుల్‌ 2' నివాళి

కృష్ణంరాజు మరణవార్త తెలిశాక తనను తానూ కంట్రోల్ చేసుకోలేకపోయానని నట సింహం బాలకృష్ణ అన్నారు. 'అన్‌స్టాపబుల్‌ 2'లో ప్రభాస్, ఆయనకు మధ్య కృష్ణం రాజు మరణం గురించి జరిగిన సంభాషణ...

తెలుగు చిత్రసీమలో రెబల్ స్టార్ ఎవరంటే? అందరూ చెప్పే పేరు కృష్ణం రాజు (Krishnam Raju). ఆయన నట వారసుడిగా ప్రభాస్ (Prabhas) చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. పెదనాన్న కంటే మించిన స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు. గతేడాది కృష్ణం రాజు ఈ లోకం విడిచి వెళ్ళారు. ఆయన్ను 'అన్‌స్టాపబుల్‌ 2'లో నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. 

పెదనాన్నకు రుణపడి ఉన్నాం
ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా వచ్చిన 'అన్‌స్టాపబుల్‌ 2 - బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1 డిసెంబర్ 29న స్ట్రీమింగ్ అయ్యింది. అందులో తన మొహమాటం సిగ్గు గురించి మాట్లాడుతూ పెదనాన్నను ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. తనకు తండ్రి లక్షణాలు వచ్చాయని, పెదనాన్నలా బిగ్గరగా మాట్లాడే అలవాటు రాలేదన్నారు. ఆయన మరణం తర్వాత మొగల్తూరు వచ్చిన అభిమాన సంద్రానికి ఏర్పాటు చేసిన భోజనాల గురించి చెప్పారు. అయితే... కృష్ణంరాజు చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏం జరిగిందనేది రెండో పార్టులో చూపించనున్నారు. 

''ఇవాళ మేం ఇలా ఉన్నామంటే పెదనాన్నగారి వల్లే. ఆయనకు మేం రుణపడి ఉన్నాం. ఆ రోజుల్లో మద్రాస్ వెళ్లి పది, పన్నెండేళ్ళు విలన్ రోల్స్ చేశారు. ఆ తర్వాత సొంత బ్యానర్ స్టార్ట్ చేసి మహిళా ప్రాధాన్య చిత్రాలతో చరిత్ర సృష్టించారు. మా కుటుంబం అంతా పెదనాన్నను మిస్ అవుతోంది'' అని ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు.  

ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారు
పెదనాన్న (కృష్ణం రాజు) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారని ప్రభాస్ తెలిపారు. అప్పుడు తానూ ఆసుపత్రిలో ఉన్నానని, నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరిపానని ఆయన చెప్పారు. డాక్టర్స్‌తో టచ్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించారు.
 
కంట్రోల్ చేసుకోలేకపోయా - బాలకృష్ణ
కృష్ణం రాజు మరణించిన సమయంలో బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణలో ఉండటంతో ఇండియా రాలేకపోయారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన బాలకృష్ణ ''నాకు విషయం తెలియగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏడుపు వచ్చేసింది'' అని చెప్పారు. షోలో కృష్ణంరాజుకు నివాళి అర్పించినట్లు తెలిసింది.  

Also Read : అమెరికాలో 'వీర సింహా రెడ్డి' దూకుడు - ఫస్ట్ డే 8 కోట్లు గ్యారెంటీ!?

ప్రభాస్‌తో పాటు గోపీచంద్ కూడా జనవరి 6న స్ట్రీమింగ్ కానున్న 'అన్‌స్టాపబుల్‌ 2 -  ద బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 2లో సందడి చేయనున్నారు. అందులో ఎమోషనల్ మూమెంట్స్ మాత్రమే కాదు, సరదా సంభాషణలు కూడా ఉన్నాయి. ప్రభాస్, గోపీచంద్ హీరోయిన్ కోసం గొడవ పడ్డారని అడగటం 'నేనేమీ గొడవ పడలేదు. నువ్వు పడితే చెప్పేయ్' అని ప్రభాస్ అనడం ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో చూపించారు. అందువల్ల, మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
 
ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ప్రభాస్ అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు యాప్ ఓపెన్ చేయడంతో 'ఆహా' కాసేపు పని చేయలేదు. ఈసారి అటువంటి సమస్య ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ పార్టులో ప్రభాస్ పెళ్లి టాపిక్, పులులు దత్తత తీసుకోవడం వంటి విషయాలు ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. 

Also Read : ఇక్కడ నాగ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget