Samantha Naga Chaitanya : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'
Ved Box Office Collections : నాగ చైతన్య, సమంత నటించిన 'మజిలీ' ఉంది కదా! దానిని మరాఠీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
![Samantha Naga Chaitanya : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ' Riteish Deshmukh Genelia Ved's Gets Huge Collections Remake of Naga Chaitanya Samntha's Majili Samantha Naga Chaitanya : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/03/e2cec3bf9277e80b7e0a0cdef1524ed91672740534657313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మరాఠీలో డిసెంబర్ 30న 'వేద్' (Ved Marathi Movie) విడుదలైంది. ఆ సినిమాలో నిజ జీవితంలో భార్యాభర్తలైన జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ జంటగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ హ హాసిని అంటే ఆమె గుర్తుకు వస్తారు. జెనీలియా నటించిన సినిమా కావడంతో 'వేద్' ప్రచార చిత్రాలపై తెలుగు జనాల కన్ను పడింది. ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది.
'వేద్'... మన 'మజిలీ'కి రీమేక్!
'వేద్' టీజర్, ట్రైలర్ చూసిన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించలేదు. వై? ఎందుకు? అంటే... ఆల్రెడీ చూసిన తెలుగు సినిమా సన్నివేశాలను మరాఠీలో మరొక జంట నటించగా చూసినట్టు ఉంది. తెలుగులో విజయం సాధించిన 'మజిలీ'కి అది రీమేక్ కాబట్టి! అవును... అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ'కి మరాఠీ రీమేక్ 'వేద్'. అక్కడ రితేష్, జెనీలియా నటించారు.
నాలుగు రోజుల్లో 13 కోట్లు!
మహారాష్ట్రతో పాటు కొన్ని ఏరియాల్లో విడుదలైన 'వేద్'కు ఫస్ట్ వీకెండ్, ఆ తర్వాత మండే కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో రూ. 13 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విశేషం ఏమిటంటే... సినిమా విడుదలైన రోజు జస్ట్ రూ. 2.25 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ, విడుదలైన నాలుగో రోజు సోమవారం రూ. 3.02 కోట్లు వచ్చాయి. శని, ఆది వారాలు ఇంకా ఎక్కువ అనుకోండి.
#Marathi film #Ved is UNSTOPPABLE… Passes the make-or-break Monday test with flying colours… Day 4 [Mon] is HIGHER than Day 1 [Fri], which is a rarity… EXCELLENT TRENDING… Fri 2.25 cr, Sat 3.25 cr, Sun 4.50 cr, Mon 3.02 cr. Total: ₹ 13.02 cr. pic.twitter.com/cGCdrBQzTs
— taran adarsh (@taran_adarsh) January 3, 2023
తెలుగులో 'మజిలీ' విడుదలైన సమయానికి నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోలేదు. వాళ్ళు ఇద్దరూ భార్యాభర్తలు. నిజ జీవితంలో జంట వెండితెరపై కూడా జంటగా కనిపించడం... చైతన్య కాళ్ళకు సమంత నమస్కరించడం వంటి కొన్ని సన్నివేశాలు, సినిమాలో భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగునాట సినిమా భారీ వసూళ్ళు సాధించింది.
మరాఠీలో కూడా సేమ్ మేజిక్ రిపీట్ అవుతోంది. రితేష్, జెనీలియా రియల్ లైఫ్ కపుల్. స్క్రీన్ మీద కూడా కపుల్ రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళ మధ్య జరిగే సరదా సంభాషణలకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నిజ జీవితంలో వాళ్ళ బంధంతో పోలిస్తే... స్క్రీన్ మీద క్యారెక్టర్స్ డిఫరెంట్. కానీ, వాళ్ళ రియల్ లైఫ్ రిలేషన్, ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. వసూళ్ళు సాధించి పెడుతున్నాయి.
Also Read : 'దిల్' రాజు ఒక్కడూ ఒకవైపు - బడా నిర్మాతలు మరోవైపు? టాలీవుడ్‌లో నయా రగడ??
మరాఠీలో విడుదలైన నాలుగు రోజుల్లో పదమూడు కోట్లు కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. అన్నట్టు... 'వేద్'కు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించారు. జెనీలియా డిసౌజా నిర్మించారు. హీరో హీరోయిన్లుగా మాత్రమే కాదు... దర్శకుడిగా భర్త, నిర్మాతగా భార్య కూడా విజయం అందుకున్నారు. మూడు విధాలుగా 'మజిలీ' వాళ్ళకు వర్కవుట్ అయ్యింది.
పెళ్ళి తర్వాత తెలుగు తెరకు దూరమైన జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి కథానాయకుడిగా పరిచయం చేస్తూ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమాలో జెనీలియా నటిస్తున్నారు. అందులో శ్రీలీల మరో కథానాయిక. అది పాన్ ఇండియా సినిమా.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)