అన్వేషించండి

Veera Simha Reddy Bookings USA: అమెరికాలో 'వీర సింహా రెడ్డి' దూకుడు - ఫస్ట్ డే 8 కోట్లు గ్యారెంటీ!?

అమెరికాలో 'వీర సింహా రెడ్డి' సినిమా ప్రీ సేల్స్ అదిరాయి. మొదటి రోజు సినిమా వన్ మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy) అమెరికాలో దూకుడు చూపిస్తోంది. సినిమా ప్రీ సేల్స్ అదిరాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే... బాలకృష్ణ సినిమా ప్రీ సేల్స్ ఎక్కువ ఉన్నాయి. 

 82 లక్షలు అండ్ కౌంటింగ్!
ఆల్రెడీ 'వీర సింహా రెడ్డి' ప్రీ సేల్స్ అమెరికాలో 100కె దాటాయి. అంటే 82 లక్షలు అన్నమాట. సినిమా విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉంది. ఒక్కో షో ఫుల్ అవుతూ ఉండటంతో స్క్రీన్లు యాడ్ చేస్తూ వెళుతున్నారు. సినిమా విడుదల దగ్గర పడే సమయానికి మరిన్ని షోలు పడే అవకాశం ఉంది. ఫస్ట్ డే వన్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్క అమెరికా నుంచి మొదటి రోజు, అంతకు ముందు ప్రీమియర్ షో కలుపుకొంటే ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Also Read : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'

ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'వీర సింహా రెడ్డి' ట్రైలర్ (Veera Simha Reddy Trailer)ను జనవరి 6న విడుదల చేయనున్నారు. తొలుత బాలకృష్ణ, శ్రుతీపై తెరకెక్కించిన 'మాస్ మొగుడు' పాటను జనవరి 3న... అనగా మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు.  ఇప్పుడు ఆ పాటను వెనక్కి తీసుకు వెళ్ళారు. 'మాస్ మొగుడు' తర్వాత విడుదల చేస్తామని... ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది.  

సాంగ్స్ సూపర్ హిట్టు
ఇప్పటి వరకు 'వీర సింహా రెడ్డి' సినిమాలోని మూడు పాటలను విడుదల చేశారు. ఆ మూడు పాటల్లో 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి...' హైలైట్. నారి నారి నడుమ అన్నట్టు.... హీరోయిన్ హానీ రోజ్, 'చీకటి గదిలో చితక్కొట్టుడు' ఫేమ్ చంద్రికా రవితో బాలకృష్ణ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో కూడా ఆ సాంగ్ చాలా  స్పెషల్‌గా ఉండబోతోందని, ప్రేక్షకుల చేత థియేటర్లలో స్టెప్పులు వేయించేలా ఉంటుందని సమాచారం. 

Also Read : టాలీవుడ్‌లో విషాదం, 2023లో తొలి మరణం - చిరంజీవి సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ...' పాట రాసిన పెద్దాడ మూర్తి మృతి

తొలుత 'జై బాలయ్య' పాటపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ... మెల్లగా జనాల్లోకి ఎక్కేసింది. 'సుగుణ సుందరి' పాటలో శ్రుతీతో బాలకృష్ణ వేసిన స్టెప్పులు కూడా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

దుమ్ము లేపుదాం! - తమన్
సంక్రాంతికి సినిమా చూడాలని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల్లో సంగీత దర్శకుడు తమన్ మరింత అంచనాలు పెంచేశారు. 'అఖండ' విజయంలో నేపథ్య సంగీతం ముఖ్య భూమిక పోషించింది. థియేటర్లలో జనాలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకు వెళ్ళింది. అయితే, అమెరికాలో కొంత మంది సౌండ్ ఎక్కువైందని కంప్లైంట్స్ చేశారు. బహుశా... ఆ విషయం తమన్ మనసులో బలంగా ఉందనుకుంట!  ''కలుద్దాం... దుమ్ము లేపుదాం! జై బాలయ్య. ఈసారి థియేటర్స్... దయచేసి కంప్లైంట్స్ చేయకండి. ప్రిపేర్ అవ్వండి'' అని తమన్ ట్వీట్ చేశారు. అదీ సంగతి!

బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget