(Source: ECI/ABP News/ABP Majha)
Karthika Deepam : పొట్టి బట్టలు వేసుకోవాల్సి వస్తుందని..!
బుల్లితెరపై టాప్ రేటింగులతో దూసుకుపోతుంది 'కార్తీకదీపం' సీరియల్. దీనికి పోటీగా ఎన్ని సీరియల్స్ వస్తున్నా.. ఏదీ ధీటుగా నిలవలేకపోయింది.
బుల్లితెరపై టాప్ రేటింగులతో దూసుకుపోతుంది 'కార్తీకదీపం' సీరియల్. దీనికి పోటీగా ఎన్ని సీరియల్స్ వస్తున్నా.. ఏదీ ధీటుగా నిలవలేకపోయింది. ఈ సీరియల్ లో పనిమనిషి క్యారెక్టర్ ప్రియమణి పండించే కామెడీ బాగానే క్లిక్ అయింది. పైకి మోనితను పొగుడుతూ.. లోపల మాత్రం శాపనార్ధాలు పెట్టే పాత్రలో ఆమె పాత్ర భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ పాత్రలో ఒదిగిపోయింది నటి శ్రీదివ్య. కేవలం నటనే కాదు.. ఆమె క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఈ సీరియల్ లోకి ఏసీపీ రోషిని ఎంట్రీతో.. ప్రియమణి రోల్ కి స్కోప్ మరింత పెరిగింది. ఈ సీరియల్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న నటి శ్రీ దివ్య.. తన పర్సనల్, కెరీర్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన శ్రీదివ్య.. సినిమా కష్టాలు చాలానే పడింది. క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తాజాగా తన వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ.. తన చిన్నప్పుడే పెళ్లైన విషయాన్ని బయటపెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. ''2014లో ఇండస్ట్రీకి వచ్చాను.. చిన్నప్పుడే పెళ్లైపోయింది. ఈ విషయం చాలామందికి తెలుసు. గృహిణిగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక.. ఎక్కువగా టీవీ చూసేదాన్ని.. ఆ సమయంలో కొంతమంది ముఖాలు చూసి వాళ్లే చేస్తున్నారు నేను చేయలేనా అనుకున్నా. దీంతో ప్రయత్నాలు మొదలుపెట్టా.. ఇంట్లోవాళ్లని కష్టపడి ఒప్పించి ఇండస్ట్రీకి వచ్చా'' అంటూ తెలిపింది.
టీవీ సీరియల్స్ కంటే ముందు వెబ్ సిరీస్ లో నటించినట్లు.. హీరోయిన్ ఫ్రెండ్ గా చేయడానికి పిలిచారని చెప్పింది. డైరెక్టర్ తనను కెమెరా ఫ్రేమ్ లో చూసిన తరువాత ఫ్రెండ్ క్యారెక్టర్ నుండి మెయిన్ లీడ్ కు ప్రమోట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. కానీ తనకు హీరోయిన్ గా చేయడానికి పెద్దగా ఇష్టం లేదని.. చిన్న చిన్న పాత్రలు చేస్తే చాలని అనుకున్నట్లు చెప్పింది. హీరోయిన్ అంటే పొట్టి బట్టలు వేసుకోవాలని.. చాలా చేయాల్సి వుంటుందనే మైండ్ సెట్ తో ఉన్నట్లు.. అందుకే హీరోయిన్ గా చేయనని చెప్పానని గుర్తు చేసుకుంది.
ఆ తరువాత తన చుట్టూ ఉన్నవాళ్లు కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నానని.. కానీ కారణమేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పుకొచ్చింది. సినిమాలైతే చాలానే చేసినట్లు.. ఎక్కడో ఓ ఫ్రేమ్ లో కనిపించేదాన్ని అని తెలిపింది. తరువాత ఫ్రెండ్ క్యారెక్టర్లు చాలానే చేశానని.. ఎన్ని పాత్రలు చేసినా.. 'కార్తీకదీపం' సీరియల్ తో తనకు మంచి పేరొచ్చిందని.. ఇందులో తన పాత్ర చిన్నదే అయినా మంచి ఫేమ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
వేరే సీరియల్స్ తో తన పాత్ర పెద్దదే అయినా.. 'కార్తీకదీపం' సీరియల్ కు వచ్చినంత పేరు రాలేదని తెలిపింది. అంతకు ముందు 'మహలక్ష్మి', 'రాములమ్మ' సీరియల్ లో నెగెటివ్ క్యారెక్టర్స్ చేసినట్లు.. 'జాబిలమ్మ' సీరియల్‌తో పాటు దూరదర్శన్‌లో కూడా చాలా సీరియల్స్ నటించానని చెప్పింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రలు చేసినా రాని ఫేమ్.. ఒక పనిమనిషిగా చేస్తే వచ్చిందని.. అదీ కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంటూ చెప్పుకొచ్చింది.